Saakshyam
Nothing scared but the truth

అనర్హత వేటు విషయంలో చేతులెత్తేసిన సుప్రీం

0

క్రిమినల్ కేసుల్లో(Criminal Cases)ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్ట సభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని వాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నేరం రుజువైతే తప్ప వారిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేసింది. అభియోగ దశ నుండే ఎన్నికలో పోటీ చేయకుండా ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థతో పాటు బాజాపా నేత అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ లు సుప్రీం లో పిటిషన్ దాఖలు వేశారు.
దీనిపై పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ నేరం రుజువయ్యేంత వరకు చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో తాము లేమని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో నిర్ణయాన్ని పార్లమెంట్ కె వదిలేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

You might also like