Saakshyam
Nothing scared but the truth

వినూత్న నిరసన తెలిపిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే

Ysrcp MLA protested in a different manner | Telugu political news | Saakshyam

0

Ysrcp MLA protested in a different manner | Telugu Political News | Saakshyam

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న పద్దతిలో నిరసన తెలియజేసారు . నెల్లూరులోని ఒక వీధిలో మురికి కాలువపై వంతెన నిర్మించాలని కోరుతూ ఏకంగా (Ysrcp MLA protested in a different manner) మురుగులోకి దిగి నిరసన తెలపారు. మురుగు కాలువపై వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలంనుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వాళ్ళ స్థానికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

Ysrcp MLA protested in a different manner | Telugu news | Saakshyam

అధికారుల నిర్లక్ష్యంతో శ్రీధర్ రెడ్డి ఏకంగా సమస్యగా మారిన మురుగు కాలువలోకి వెళ్ళి నిలబడ్డారు. అధికారులు వచ్చే వరకు తాను మురుగు కాలువలోనే ఉంటానని భీష్మించుకుని అలాగే ఉన్నారు. ఎమ్మెల్యే అలా మురుగు కాలువలో ధర్నాకు దిగడంతో స్థానికులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఎమ్మెల్యే నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్న అధికారులు హుటా హుటిన ఆ ప్రదేశానికి చేరుకుని హడావిడి చేసి ఎమ్మెల్యే ని బయటకు తీసుకొచ్చారు. తొందర్లోనే వంతెన నిర్మించేలా ప్రతిపాదనలు పంపుతామని అధికారులు తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here: చక్కనయ్యా.. చందమామా.. ఎక్కడున్నావూ?

You might also like