Saakshyam
Nothing scared but the truth

తిరుమలలోనూ పోటెత్తిన జగన్‌ అభిమానం

Ysrcp members followed Jagan foot steps in thirumala | Telugu political news | Saakshyam

0

Ysrcp members followed Jagan foot steps in thirumala | Telugu political news | Saakshyam

ఏడాదికి పైగా, 3648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇచ్చాపురం (Ysrcp members followed Jagan foot steps in thirumala) నుంచి నేరుగా తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే క్రమంలో, వైఎస్‌ జగన్‌ నడక మార్గాన్ని ఎంచుకోవడంతో ఆయన వెంట అభిమాన సంద్రం పోటెత్తింది. గతంలో వైఎస్‌ జగన్‌ తిరుమలకి వెళ్ళిన ప్రతిసారీ ఏదో ఒక వివాదాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తీసుకొచ్చేది. ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైన టీడీపీ, ఈసారి కూడా పలు వదంతుల్ని తెరపైకి తీసుకురాబోతోందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుగానే అనుమానం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

 

Ysrcp members followed Jagan foot steps in thirumala | Telugu news | Saakshyam

జగన్‌ వెంట వందలాదిగా అభిమానులు కాలినడక మార్గంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళారు. మెట్లు ఎక్కుతున్న క్రమంలో వైఎస్‌ జగన్‌ ఎక్కడా అలసటకు గురికాలేదు. దారిపొడవునా అభిమానులు జగన్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారిని చిరునవ్వుతోనే పలకరిస్తూ వైఎస్‌ జగన్‌, నడకదారిన తిరుమలకు వెళ్ళారు. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందే, వైఎస్‌ జగన్‌ తిరుమలకు వెళ్ళి, మొక్కుకున్న విషయం విదితమే. పాదయాత్ర పూర్తయ్యాక, తిరిగి తిరుమలకు కాలిక నడకన వస్తానని మొక్కుకున్న జగన్‌ ఆ మొక్కుని ఈ రోజు తీర్చుకున్నారు. కాగా, ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జనం కన్పించలేదంటూ టీడీపీ నేతలు వెటకారాలు చేస్తున్న దరిమిలా, వారికి అలిపిరి, తిరుమల కాలినడక మార్గంలో జగన్‌ వెంట కన్పించిన జన సంద్రమే సరైన సమాధానం ఇచ్చిందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like