Saakshyam
Nothing scared but the truth

మొత్తానికి రాజమౌళికే చెమటలు పట్టిస్తున్నారుగా…!!

0

ఆ హీరో అలా ఈ హీరోయిన్ ఇలా ఆ డైరెక్టర్ ఇలా చేసాడు ఇలాంటి సినిమా చేస్తున్నాడు అంటూ కధనాలు పుట్టించే యూట్యూబ్ చానెల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. తమకి తోచినట్లు వార్తలు రాసుకుంటూ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. అంతటితో ఆగుతున్నారా అంటే అబ్బే అదేమీ లేదు ఆ హెడ్డింగ్స్ కి మరింత మసాలా జోడించి మరి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో రాజమౌళి పైన ఒక వార్త నేట్టింట్లో హల్చల్ చేస్తుంది. రాజమౌళి సినిమా అంటే ఇండస్ట్రీ లో ఆ కిక్కే వేరు, అతని సినిమా ముందుగానే ప్రమోషన్ చేసుకోవడానికి ఇష్టపడదు ఎందుకంటే ముందుగానే కధ తెలిసిపోతే సినిమాపై అభిమానులకు ఆసక్తి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయని రాజమౌళి తన సినిమాల గురించి మీడియాతో ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ పంచుకోవడానికి ఇష్టపడదు. అయితే రాజమౌళి తన సినిమాల గురించి చెప్పకపోయినా కూడా అతని సినిమాల గురించి ఎప్పుడు ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంటుంది.

తాజాగా రాజమౌళి బాహుబలి లాంటి సినిమా తరువాత ఒక మల్టీ స్టారర్ సినిమాని రూపొందించబోతున్నారు ఆ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు ప్రముఖ పాత్రలు పోషించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు ఎదో ఒక వార్త బయటకి వస్తూనే ఉంది మొన్న ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కాస్తా లావుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించగా ఇదే ఎన్టీఆర్ కొత్త సినిమాలోని గెటప్ అంటూ అభిమానులు ప్రచారం చేశారు. తమ సినిమా గురించి ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ ఇవ్వకపోయినా ఏదో విధంగా దానిని న్యూస్‌లో వుంచడం చూసి రాజమౌళి షాకయ్యాడట. సమాచారం ఇవ్వని పక్షంలో న్యూస్‌ ఎలా క్రియేట్‌ చేస్తారో, ఎంత న్యూసెన్స్‌ చేయగలరో చూసి రాజమౌళికే చెమటలు పట్టేసాయట. మొత్తానికి దర్శకదిగ్గజానికే చెమటలు పట్టిస్తున్నారు.

You might also like