Saakshyam
Nothing scared but the truth

అదేంటి కధానాయకుడు పై ఎన్టీఆర్ ఉలుకు పలుకు లేదు..?

Why NTR Silent On NTR Kadhanayakudu Movie || Telugu News || Saakshyam

0

Why NTR Silent On NTR Kadhanayakudu Movie || Telugu Film News || Saakshyam

అన్నగారి సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశారు, ఆయనని మళ్ళి తెరపైన చూడాలని ఆ మధుర జ్ఞాపకాలు అన్ని కూడా మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని నందమూరి ( Why NTR Silent On NTR Kadhanayakudu Movie ) అభిమానులందరూ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది జనవరి 9 న తెలుగు తమ్ముళ్ళకు సరికొత్త ఊపు వచ్చింది సంక్రాంతికి మూడు రోజుల ముందే పండగ జరుపుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్ళకు ఆరాధ్య దైవం అయిన నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర చూసి తరించిపోయారు అందరు. ఒక రాముడు ఒక కృష్ణుడు అయన రూపంలోనే తలచుకొనే వారు తెలుగు బిడ్డలకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బయోపిక్ వచ్చేసింది. ఇటు నందమూరి ఫ్యామిలీతోపాటు అటు అభిమానులు సైతం ఈ సినిమా గురించి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అదిరిపోయింది.. అద్భుతంగా ఉంది.. సూపర్ అంటూ పొగిడేస్తున్నారు.

ఇంత సందడిలోనూ ఒక నిశ్శబ్దం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ నిశబ్దం ఎవరిదీ అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది. తన తాతగారి సినిమా విడుదలయ్యి 24 గంటలు గడిచిపోయింది కాని ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి స్పందన లేదు. ఈ సినిమాలో స్వయంగా ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ నటించి అందరిని మైమరపించారు కానీ బాలయ్య పైన కూడా ఎన్టీఆర్ ఎలాంటి కామెంట్స్ వెయ్యలేదు. గతంలో బాలకృష్ణ కు ఎన్టీఆర్ కి మాటలు యుద్ధం జరిగింది కానీ హరికృష్ణ మరణం తరువాత అది కాస్తా మరుగున పడింది అందరు ఒకే కుటుంబం అని చెప్పుకున్నారు. బాబాయ్ కి తనకు పంచాయితులు ఉంటె ఉండవచ్చు కాని పార్టి సినిమాలో ఎదో ఒక సందర్భంలో తాత మనవడిని అలియాస్ తారక్ అని చెప్పుకొనే ఎన్టీఆర్ ఈ సినిమా పై స్పందించకపోవడం అందరికి అచ్చర్యాన్ని కలిగిస్తుంది.

Why NTR Silent On NTR Kadhanayakudu Movie || Tollywood News || Saakshyam

ఇదిలా ఉంటే.. తారక్ ట్విట్టర్ పేజీలో ఈ మూవీకి సంబంధించిన చాలా పాత అప్డేట్ ఉంచారు. డిసెంబరు 21న ఎన్టీఆర్ అధికారిక టీజర్ ను పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొత్త సంవత్సర శుభాకాంక్షలు మినహా మరే పోస్టు లేదు. బహుశా సినిమా రిలీజ్ అయిన తరువాత తాతగారి పోటో తన వాల్ పోస్టర్ గా పెట్టుకొని అభిమానులకు కిక్ ఇద్దామని ఇలా చేసారేమో అని అనుకుంటే అది కూడా లేదు ఈ విషయంలో కూడా తారక్ ఫాన్స్ కి నిరాశనే మిగిల్చారు. ఇదంతా చూస్తే.. కథానాయకుడి మూవీతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తారక్ తీరు ఉందన్నట్లుగా ఉంది. తారక్ ఎందుకు ఇలా చేస్తునందో అర్ధం కావడం లేదు. దీని వెనుక ఏమైనా రహస్యం ఉందేమో చూద్దాం..ఎదో ఒక రోజు బయటకి వస్తుంది కదా…

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  కధానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..?

You might also like