Saakshyam
Nothing scared but the truth

తెలంగాణ ప్రజలంటే లగడపాటి కి ఎందుకంత చిన్నచూపు? సర్వే ఎందుకు మార్చారు?

Why Lagadapati changed survey report | Telugu political news | Saakshyam.com

0

Why Lagadapati changed is survey report | Telugu political news | Saakshyam.com

తెలుగు ప్రజల ఆక్టోపస్ గా పేరు తెచ్చుకొన్న లగడపాటి, ఒక మాయలమారి చంద్రబాబు జిమ్మిక్కుల్లో పడి మాట మార్చటం ఎందుకు? (Why Lagadapati changed is survey report) తెలంగాణ ప్రజల నాడికి మరియు వారి భవిష్యత్తు కు సంబంధించిన సున్నితమైన అంశం లో ఒక్కసారి అబద్దం చెప్పడం వల్ల పరువు పోతుందని తెలియదా? తాను చెప్పే సర్వే నిజానికి దగ్గర్లో ఉంటుందని నమ్మి నిరక్షరాస్యులు ఇతని గత చరిత్రని నమ్మి తప్పుడు నాయకులకు ఓటేసి తప్పు నిర్ణయం తీసుకోవడానికి కారణం కాదా? గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సర్వే ఫలితాలు చెప్పినంత ధైర్యం ఇప్పుడు లేదా? అసలు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గినాడో ? లేదా తెలంగాణ అంటే ముందు నుంచీ చిన్నచూపే అని కావాలనే చేస్తున్నాడా? తెలంగాణ ఇవ్వకముందు మన ఈ రాజగోపాల్ చేసిన నాటకాలు పాఠకులందరికీ విదితమే.

తెలంగాణ లో ఈయన వ్యాపారాలకు ఏ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదే. ఈయన వ్యతిరేకంగా సర్వే ఇచ్చిన TRS పార్టీ కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఎవరి ఒత్తిడి? ఎందుకీ వంచన?. ఎందుకు విశ్వశనీయత దెబ్బతినేంత ఈ సాహసం? ఎందుకంత ప్రేమ వాళ్లమీద? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడినందుకు ఇది బహుమతా? లేక ఫలితాలు మారిస్తే పోలవరం ప్రాజెక్ట్ లో లాంకో కంపెనీ నీ కేమైనా పెద్ద కాంట్రాక్టు ఇస్తానన్నాడా?

సరిగ్గా రెండు వారాల క్రితం తెరాస రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుందని స్వయానా కేటీఆర్ కు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. అందులోనూ లగడపాటి చంద్రబాబు కు కూడా తెరాస గెలుస్తుందని చెప్పినట్లుంది. అసలు కూటమి లో పెద్ద పార్టీ కాంగ్రెస్. చెప్పితే కాంగ్రెస్ వాళ్లకు కదా చెప్పాలి. బాబుకెందుకు? తాను మరచిపోయాడనుకొంటా. తాను మెసేజ్ పెట్టింది ఒక బలమైన ఐటీ మినిస్టర్ కు అని. అతని పనితీరు, మాట తీరే అతని బలం. అందరూ ఆంధ్ర ఐటీ మినిస్టర్ లా ఉండరని తెల్సుకోలేదేమో?. అయినా కేటీఆర్ నీకు మర్యాదిచ్చి, నువ్వు చెప్పినట్లు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ కష్టమేదో ఆ పార్టీ వాళ్ళు పడుతా ఉన్నారు. ఎప్పుడైతే లగడపాటి అబద్దం చెప్పాడో అప్పుడు తాను కూడా ఆ విషయాన్నీ బయటపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు లగడపాటి బయటొచ్చి ఏమి సమాధానమిస్తాడో చూద్దాం.

Why Lagadapati changed is survey report | Telugu news | Saakshyam.com

మరో కొన్ని నెలల్లో జరిగే ఆంధ్ర ఎన్నికల్లో కూడా ఈయన ఆడబోయే నాటకం ఎలా ఉంటుందో ముందే ప్రజలకు తెలిసొచ్చింది. ఇప్పుడు ఆయనెంత మొత్తుకున్నా ఆంధ్ర ఆక్టోపస్ గాలి కాస్తా పస్ అంటా పోయింది. అయినా సముద్రాన్నీ కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్న బాబోరికి, లగడపాటి ఓ లెక్కా? ఏమో మరి వచ్చే సారి ఆంధ్ర లో జగన్ వస్తాడని నిజం బయటవచ్చినా జనాల్లో గందరగోళం పుట్టించాలని బాబోరు ఇలా లగడపాటి ను ఇరికిచ్చారని వస్తున్న గుసగుసలు నిజo కావచ్చేమో?

కథనం మరియు విశ్లేషకులు:

సహదేవ బోడె గారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:నీ అజ్ఞానం తో ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తావా పవన్ (నిత్య)కల్యాణా?

You might also like