Saakshyam
Nothing scared but the truth

ప్రస్తుతం ఈ హీరోస్ ఫ్యూచర్ పరిస్థితి ఏంటీ ఇండస్ట్రీలో…?

0

Gopichand, Raj Tarun, Sai dharam tej, Manchu Manoj, Hero’s

అసలు ఇండస్ట్రీ అంటేనే అది…హిట్స్ వస్తే తలకేక్కించుకుంటుంది అదే తరహాలో ప్లాప్స్ వస్తే ముఖం కూడా చూపించదు అంతేకదా మరి హిట్స్ వస్తే ఆటోమాటిక్ గా లాభాలు వస్తాయి కానీ ప్లాప్స్ వస్తే గనుక నష్టాలు తప్పనిసరి అందుకే..ఇండస్ట్రీ లో హీరోస్ గాని దర్శకనిర్మాతలు గాని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇప్పడు ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పటివరకు ఇండస్ట్రీ లో హీరోస్ (Hero’s) గా పరిచయమైన కొంతమంది ప్రస్తుతం అడ్రెస్ లేకుండా పోయారు వారిలో ముఖ్యంగా కొంతమంది గురించి చెప్పుకోవాలి కుమారి 21F తో ఒక మోస్తరు హిట్ ని అందుకున్న రాజ్ తరుణ్ ఆ తరువాత కొన్ని సినిమాలు గ్యాప్ లేకుండా చేశారు అందులో హిట్స్ కన్నా కూడా ఫ్లాప్సే ఎక్కువగా ఉన్నాయి దాంతో ఇప్పుడు అయన వైపు చూసే దర్శకుడే లేరు, ఇక మెగా బ్రాండ్ ని వాడుకొని ఇండస్ట్రీ లోకి పిల్లా నువ్వు లేని జీవితం అంటూ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధర్మ తేజ్.. ఆ సినిమాలో తన ప్రాతం చూపించాడు డాన్సులతో మెగా అభిమానులను మైమరపించాడు అయిన కూడా లాభం లేకుండా పోయింది.

మొదటి సినిమా కదా కొంచెం ఇంప్రూవ్ అవుతాడో అనుకున్నారు అంత కూడా కాని చేస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా ఫ్లాప్స్ తోనే మొదలోతుంది దాంతో తన ఇమేజ్ తగ్గడమే కాకుండా దర్శకులకు కూడా మార్క్ వస్తుంది ఇక అంతే ప్రస్తుతం అబ్బాయి గారి రేంజ్ మొత్తం కూడా డౌన్ అయిపొయింది, తరువాత చూసుకుంటే అక్కినేని వారసుడు పెళ్లికి ముందు మంచి హిట్స్ తో దూసుకుపోయిన కూడా పెళ్లి తరువాత వచ్చిన మూడు సినిమాలు నష్టాలనే మిగిల్చాయి. ఎంతో కొంత ఇమేజ్ ని దక్కించుకున్నాడు కాని అది ఇప్పుడు మొత్తం పోయేలా కనిపిస్తుంది. ఇతగాడికి ఇంకొక ఫ్లాప్ గనుక పడితే ఇక అడ్రెస్ గల్లంతే అన్న టాక్ నడుస్తుంది ప్రస్తుతం. తోమిదేళ్ళు అవుతున్నా ఇప్పటి దాకా ఏ సినిమా కనీసం 30 కోట్ల మార్కు చేరుకోలేదు. విజయ్ దేవరకొండ ఈ ఫీట్ మూడు సార్లు సాధించాడు. ఈ నేపథ్యంలో పోటీ వల్ల ఒత్తిడి సహజంగానే ఉంటుంది. వీరంతా కాస్తా జూనియర్ కాసేపు వీరి సంగతి పక్కన పెడితే సీనియర్ నటుడైన గోపిచంద్ ఒక విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తన పెర్ఫార్మన్స్ తో హీరో గా ఎదిగాడు ఇప్పటికి చాలా సినిమాలు చేసాడు దాదాపు అన్ని కూడా హిట్ టాక్ నే అందుకున్నాయి కానీ గత నాలుగు సంవత్సరాల నుండి ఇతగాడి పరిస్థతి దారుణంగా ఉందనే చెప్పుకోవాలి.

అభిమానుల బలం ఉన్నా నాసిరకం మాస్ కథలతో గోపి చేస్తున్న సినిమాలు బాగా చేటు చేస్తున్నాయి. ఇక రామ్ సిచువేషన్ కూడా భిన్నంగా ఏమి లేదు. వెతికి మరీ హిట్టు దర్శకులతో చేస్తున్నా మార్కెట్ ఎదగడం లేదు. హలో గురు ప్రేమ కోసమే కూడా అదే దారిలో నడిచింది. ఇక అల్లరి నరేష్ ఇతగాడు హాస్య నటుడిగా పేరు సంపాదించుకున్నాడు ఎంతటి బాధలో ఉన్న కూడా నరేష్ సినిమాలు చూస్తే అభిమానులు తెగ నవ్వేసుకుంటారు, మొదట్లో ఇతని కెరీర్ బాగానే నడిచింది కాని ఇప్పుడు అంతగా కలిసి రావడం లేదు దాంతో సైడ్ క్యారెక్టర్స్ పరిమితమైపోతునాడు. ఇక మంచు హీరోలు విష్ణు, మనోజ్ గురించి ఎక్కువ ప్రస్తావించకపోవడం ఉత్తమం. కళ్యాణ్ రామ్ సైతం ఏమంత మెరుగ్గా లేడు. ఇంకా పటాస్ పేరే చెప్పుకుని సినిమాలు చేసుకుంటున్నాడు. కావాల్సినంత టాలెంట్ ఉన్నా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఈ హీరోలందరూ ఇలా కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇది మరి మన హీరోస్ పరిస్టితి. ఇప్పటికికైనా కాస్తా మెరుగు పడి మంచి కధలను ఎంచుకొని సినిమాలు చేస్తే హిట్ వచ్చే చాన్సులు ఉన్నాయి లేదంటే ఇంకా అంతే సంగతులు..

You might also like