Saakshyam
Nothing scared but the truth

వినయ విధేయ రామ మూవీ రివ్యూ అండ్ రేటింగ్…!!

Vinaya Vidheya Rama rating & review || Telugu Film News || Saakshyam

0

Vinaya Vidheya Rama rating & review || Telugu Movie News || Saakshyam || Vinaya Vidheya Rama

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ( Vinaya Vidheya Rama rating & review )

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : డివివి దానయ్య

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

‘ధృవ’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్ట మొదటి సారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ లాంటి ఎందరో పేరున్న నటీనటులు నటించారు. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 11న) విడుదలైంది. మరి ఈ వినయ విధేయ రాముడు ఏ మేరకు మాస్ ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.

క‌థ‌:
న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు. అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్‌(రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు.

భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు. ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌ర‌నీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

Vinaya Vidheya Rama rating & review || Tollywood News || Saakshyam || Ram Charan

ప్లస్ పాయింట్స్ :

* రామ్ చరణ్ డాన్సులు.
* బోయపాటి మార్క్ మాస్ ఫైట్స్.
* ఇంటర్వెల్ బ్లాక్,రామ్ కో..ణి..దె..ల డైలాగ్ ఎపిసోడ్.
* తస్సాదియ్యా,రామ లవ్స్ సీత పాట.

మైనస్ పాయింట్స్ :

* రొటీన్ కథ.
* పేలవమైన పాటలు.
* సెకండాఫ్.

సాంకేతిక విభాగం :

ముందుగా కెప్టెన్ ఆఫ్ ద మూవీ అయిన బోయపాటి శ్రీనుకి ఏ హీరోని ఎలా చూపించాలో బాగా తెలుసు. అందుకే రామ్ చరణ్ ని ఇది వరకూ చూడని ఒక కొత్త తహాలో, పవర్ఫుల్ పాత్రని డిజైన్ చేసాడు. కానీ ఆ పాత్రకి, తన ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథని తయారు చేయడంలో మాత్రం విఫలమయినట్టు క్లియర్ గా తెలుస్తోంది. 4 ఏళ్ళు ఈ కథని రాశారు అన్నారు కానీ అంత చెప్పుకునేలా లేదు. తను డిజైన్ చేసిన పాత్రకి రామ్ చరణ్ న్యాయం చేసాడు కథ, కథనంలోనే అంత పవర్ లేదు. ఎప్పటిలానే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా తీసాడు కానీ కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మీదే కాకుండా కథ- కథనం మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సింది. ఓవరాల్ గా కొన్ని కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ ని చూపిన విధానం, తన తో చెప్పించిన డైలాగ్స్, చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇంతకు ముందు చూడలేదనే చెప్పాలి. ఎప్పటిలానే బోయపాటి కథకి ఎం రత్నం రాసిన మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.

బోయపాటి ఆలోచనలకి రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్ ఇచ్చిన దృశ్య రూపం చాలా బాగుంది. అలాగే ఆ విజువల్స్ ఎలివేషన్ కి దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. దేవీశ్రీ ఇచ్చిన పాటల విషయంలో ఆడియన్స్ ని కొంత నిరుత్సాహపడినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సంతృప్తి పరిచాడనే చెప్పాలి. వివేక్ ఒబెరాయ్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ట్యూన్ అదుర్స్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అంతంత మాత్రం అని చెప్పాలి, ఎందుకంటే బోయపాటి సినిమాలకి బలం ఫైట్సే, కానీ కారణం ఏదైనప్పటికీ ప్రతి ఫైట్ ధనాధన్ అయిపోద్ది. కనల్ కణ్ణన్ యాక్షన్ డిజైనింగ్ బాగుంది కానీ తాను తీసిన ఫుల్ ఫైట్ ఉండి ఉంటే ఇంకా బాగుండేదేమో. అలాగే ఎఎస్ ప్రకాష్ సెట్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా పాటలకి వేసిన సెట్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి.

డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులు గుండెల మీద చెయ్యేసుకుని చూడండి అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్నట్టుగా మా చరణ్ తో అదిరిపోయే సినిమా తీశారు అంటూ ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకొని మరీ సినిమా నుంచి బయటకి వస్తారు.

సాక్ష్యం రేటింగ్: 3/5

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  ‘వినయ విధేయ రామ’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

You might also like