Saakshyam
Nothing scared but the truth
Page Right

సర్కార్ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే అవునా అంటారు…?

0

IlayaThalapathi Vijay Sarkar Movie First Day Collections  || Saakshyam Latest Cinema Updates

ఇలయతలపతి విజయ్ సేతుపతి ( IlayaThalapathi Vijay Sarkar Movie Collections) ఈ పేరు కి తమిళ ఇండస్ట్రీ లో ఎంత ఫాల్లోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే, ఒక్క తమిళలోనే కాదులెండి తెలుగు ఇండస్ట్రీ లో కూడా విజయ్ కి ఒక రేంజ్ లో ఫాల్లోయింగ్ ఉంది, విజయ్ ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా తన గెటప్ ని తన స్టైల్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఉంటారు, ఇది ఇలా ఉంటె దీపావళి సందర్భంగా విజయ్ సర్కార్ మూవీ ని దేశవ్యాప్తంగా విడుదల చేశారు. ఇకవైపు తెలుగలో మరోవైపు తమిళంలో మొదటి షో నుండే పాజిటివ్ బస్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ కూడా అదే రేంజ్ లో వచ్చిపడ్డాయి అని టాక్. ఈ సినిమాలో విజయ ఒక కంపెనీ సీఈఓ గా లగే ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించి అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
IlayaThalapathi Vijay Sarkar Movie First Day Collections  ||  Cinema Updates
సర్కార్ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కీలక పాత్రలో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. అయితే విడుదలైన కొద్ది గంటల వరకు సినిమాపై మంచి టాక్ నడిచిన కూడా అది సాయంత్రానికి తగ్గిపోయినట్లు వారలు వస్తున్నాయి. అసలు మురుగుదాస్ విజయ్ కాంబినేషన్లో సినిమాలు అంటే అభిమానులు ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘తుపాకి’, ‘కత్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కానీ సర్కార్ మాత్రం ఆ రేంజ్ టాక్ ని దక్కించుకోలేకపోయింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే  మొదటి రోజు ఈ చిత్రం చెన్నై లో రూ. 2.37కోట్ల వసూళ్లను రాబట్టి అంతకుముందు వున్నా రికార్డును బ్రేక్ చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడు. ఇది సర్కార్ పరిస్థితి. చూద్దాం వీకెండ్స్ లో ఏమైనా మళ్ళి పుంజుకుంటుందేమో

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : సర్కార్’ రివ్యూ అండ్ రేటింగ్…!

You might also like