Saakshyam
Nothing scared but the truth

జ‌గ‌న్ నిర్ధోషి.. ఆ కేసులు నిల‌బ‌డ‌వు

Undavalli Arun Kumar comments on Jagan cases | Telugu political news | Saakshyam

0

Undavalli Arun Kumar comments on Jagan cases | Telugu political news | Saakshyam

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఇటీవ‌ల రాష్ట్ర (Undavalli Arun Kumar comments on Jagan cases) రాజ‌కీయాలు, అధికార, ప్ర‌తిప‌క్ష నేతల పై విమ‌ర్శ‌లు చేస్తున్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబు, జ‌గ‌న్ పై వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు ఇప్పటికే తాను సంధించిన స‌వాళ్ళు స్వీక‌రించ‌లేద‌ని, అభివృద్ధి త‌క్కువ ప్ర‌చారం ఎక్కువ అని ఉండ‌వ‌ల్లి అన్నారు. ఇక జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి బాబు ద‌గ్గ‌ర ఉన్న ఆయుధం ఒక‌టే అని, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ కోర్టుల చుట్టూ తిర‌గ‌డ‌మేన‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. అయితే ఆ కేసులు, ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని, క్విడ్ ప్రో కోకు సంబంధించి నిల‌బ‌డ్డ కేసులు అస్స‌లు లేవ‌ని, ఎప్పిటికైనా జ‌గ‌న్ నిర్ధోషిగా తేల‌డం ఖాయ‌మ‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. దీంతో ఈ మాజీ ఎంపీ వ్యాఖ్య‌లు మ‌రోసారి రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

 

Undavalli Arun Kumar comments on Jagan cases | Telugu news | Saakshyam

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చంద్ర‌బాబు గెలుపుపై చెప్పిన జోష్యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  ఏపీ రాజ‌కీయాల‌పై, చంద్ర‌బాబు భ‌వితవ్యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే అవకాశాలు అసాధ్యమని, అయితే నారా చంద్రబాబు నాయుడు చివరి వరకూ తన పట్టును వదలరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.  గెలుపుకోసం బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి ఫ‌లితం శూన్య‌మ‌ని చుర‌క‌లంటించాడు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సూపర్ హిట్ అయ్యిందని ఉండవల్లి ప్రశంసించారు. గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర చాలా హిట్ అయ్యింది. ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు అని ఉండవల్లి విశ్లేషించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like