Saakshyam
Nothing scared but the truth

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ రివ్యూ అండ్ రేటింగ్..!!

0

Thugs of hindostan review, Aamir Khan, Amitabh Bachchan

నటీనటులు: ఆమిర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ – ఫాతిమా సనా షేక్ – కత్రినా కైఫ్ – రోనిత్ రాయ్ తదితరులు
సంగీతం: అజయ్-అతుల్
నేపథ్య సంగీతం: జాన్ స్టివార్ట్
ఛాయాగ్రహణం: మనుష్ నందన్
నిర్మాత: ఆదిత్య చోప్రా
రచన-దర్శకత్వం: విజయ్ కృష్ణ ఆచార్య

ఆమిర్ ఖాన్ సినిమా అంటే భారతీయ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిందే. అలాంటి హీరోకు నిన్నటితరం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జత కలవడంతో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిత్య చోప్రా నిర్మాణంలో విజయ్ కృష్ణ ఆచార్య రూపొందించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

క‌థ‌:
వ్యాపారం కోసం ఇండియా వ‌చ్చి బ్రిటీష్ వాళ్లు మ‌న సంస్థానాల‌ను, రాజ్యాల‌ను ఆక్ర‌మించుకుంటున్న త‌రుణం. రోన‌క్‌పూర్ అనే స్వతంత్ర్య రాజ్యంపై బ్రిటీష్ పాల‌కుడు జాన్ క్లైవ్ క‌న్నుప‌డుతుంది. రోన‌క్‌పూర్ రాజు, అత‌ని కొడుకుని బంధించి రాజ్యాని చేజిక్కించుకుంటాడు. వారిని చంపేస్తాడు. అయితే యువ‌రాణి జ‌ఫీరా( ఫాతిమా స‌నా షేక్‌) రాజ్య ర‌క్ష‌కుడు ఖుదా బ‌క్ష్ స‌హ‌కారంతో అక్క‌డి నుండి త‌ప్పించుకుంటుంది. ఖుదా బ‌క్ష్ ఆజాద్ పేరుతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు. బ్రిటీష్ వారు ఖుదా బ‌క్ష్‌ను దోపిడి దొంగ‌గా ప్ర‌క‌టిస్తుంది. ఇత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి జిత్తుల మారి ఫిరంగి(ఆమిక‌ర్ ఖాన్‌)ని నియ‌మిస్తారు. ఇంత‌కు ఫిరంగి బ్రిటీష్ వారికి స‌హాయ‌ప‌డ్డాడా? ఖుదా బ‌క్ష్‌కి ఎలా స‌హాయ‌ప‌డ్డాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
* కధ విధానం
* హీరో, హీరోయిన్ పెర్ఫార్మన్స్
* సినిమాలో కొనసాగే పోరాటం

మైనస్ పాయింట్స్ :

* స్లో నారేషన్
* లాజిక్ లేని సీన్స్‌
* ఎమోష‌న‌ల్ క‌నెక్టింగ్ పాయింట్ వీక్‌గా ఉండ‌టం

సాంకేతిక వర్గం:

Thugs of hindostan review

అజయ్-అతుల్ పాటలు హిందీలో ఎలా ఉన్నాయో కానీ.. డబ్బింగ్ లో మాత్రం వినసొంపుగా అనిపించవు. జాన్ స్టివార్ట్ నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్లు.. కథకు కీలకమైన సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మనుష్ నందన్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. సినిమాకు తగ్గట్లుగా కెమెరా పనితనంలో భారీతనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్థాయికి తగ్గట్లే భారీగా ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చుకు సినిమా న్యాయం చేయలేదు. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఏం ప్రత్యేకత ఉందని ఈ నవలను ఎంచుకున్నాడో తెలియదు. నవలగా అది ఎలా ఉందో కానీ.. సినిమాగా మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. దర్శకత్వ లోపమే సినిమాకు ప్రతికూలంగా మారింది.Thugs of hindostan review

సాక్ష్యం రేటింగ్ : 2.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : మీటూ మంటలో మాడిపోతున్న మెగాస్టార్…!!

Read more about :  Bollywood News   Aamir Khan   Amitabh Bachchan

You might also like