Saakshyam
Nothing scared but the truth

టాక్సీవాలా రివ్యూ అండ్ రేటింగ్…!!

Taxiwala Review And Rating || Telugu Film News || Saakshyam

0

Taxiwala Review And Rating || Telugu Movie News || Saakshyam.com

నటీనటులు : విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్ , మాళవిక నాయర్ ( Taxiwala Review And Rating )

దర్శకత్వం : రాహుల్ సంక్రుత్యన్

నిర్మాత : ఎస్ కె ఎన్

సంగీతం : జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫర్ : సుజిత్ సారంగ్

ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’ (Taxiwala Review And Rating). జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

Taxiwala Movie Update || Tollywood News || Saakshyam

క‌థ‌:
శివ‌(విజ‌య దేవ‌ర‌కొండ‌) డిగ్రీ పాసై ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. చిన్న చిన్న ఉద్యోగాల‌ను ప్ర‌య‌త్నించి న‌చ్చ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు క్యాబ్ డ్రైవ‌ర్‌గా ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అందుకోసం ఓ క్యాబ్ కొనాల‌నుకుని డ‌బ్బు కోసం అన్న‌య్య‌(ర‌విప్ర‌కాశ్‌)ని అడుగుతాడు. అన్న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉండ‌వు. ఆ స‌మ‌యంలో శివ వ‌దిన(క‌ల్యాణి) త‌న న‌గ‌లు అమ్మి డ‌బ్బులిస్తుంది. సెకండ్ హ్యాండ్ కారు కోసం శివ, అత‌ని స్నేహితులు(మ‌ధు నంద‌న్, విష్ణు) చాలా చోట్ల తిరుగుతారు. చివ‌ర‌కు ఓ కారు వారు అనుకున్న రేటుకే ద‌క్క‌ుతుంది. ఆ కారు వ‌చ్చిన వేళా విశేషంతో శివ‌కు గ‌ర్ల్‌ఫ్రెండ్(ప్రియాంక జ‌వాల్క‌ర్‌) ప‌రిచ‌యం కావ‌డంతో పాటు.. బాగా డ‌బ్బులు వ‌స్తాయి. వ‌దిన‌కు మంచి కార్పొరేట్ హాస్పిట‌ల్‌లో వైద్యం చేయిస్తుంటాడు శివ‌. అంతా స‌వ్యంగానే ఉంద‌నుకుంటున్న స‌మ‌యంలో టాక్సీలో ఓ దెయ్యం ఉంద‌ని శివ‌కు తెలుస్తుంది. దాంతో కారును వ‌దిలించుకోవాల‌ని శివ ప్ర‌య‌త్నించినా కారు అత‌నిని విడిచిపెట్ట‌దు. అయితే కారులోనే దెయ్యం మంచిద‌ని.. త‌న‌కు ఏ హాని చేయ‌డం లేదు క‌దా అని అర్థం చేసుకున్న శివ దాంతో స్నేహం చేస్తుంటాడు. ఓరోజు రాత్రి ఓ డాక్ట‌ర్ శివ టాక్సీ ఎక్కుతాడు. కారులోని దెయ్యం ఓ యాక్సిడెంట్ చేయించి ఆ డాక్ట‌ర్‌ను చంపేస్తుంది. దాంతో శివ భయ‌ప‌డిపోతాడు. ఆ కారు అస‌లు య‌జ‌మానిని క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. చివ‌ర‌కు శివ‌కు తెలిసే నిజం ఏంటి? కారులో నిజంగానే దెయ్యం ఉందా? అస‌లు శిశిర ఎవ‌రు? కారుకు, శిశిర‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

*విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్
* కామెడీ టైమింగ్
* సినిమాటోగ్ర‌ఫీ
* బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

* సెకండ్ హాఫ్
* లాజిక్స్‌కి దూరంగా కొన్ని స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న‌

సాంకేతిక విభాగం :

దర్శకుడు దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ మంచి స్టోరీ లైన్ తో పాటు మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు జెక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాలోని యస్ కె ఎన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

సాక్ష్యం రేటింగ్ 2.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : టాక్సీవాలా మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…!!

You might also like