Saakshyam
Nothing scared but the truth
Page Right

వైరల్ గా మరి నేట్టింట్లో చెక్కర్లు కొడుతున్న సోనాలి నోట్…!!

0

Sonali Bindre, cancer,  social media

ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన నటనతో, అందంతో కుర్రకారు మతులు పోగేట్టేసింది సోనాలి బింద్రే, ఈ మధ్య కాలంలో ఆమెకు బొత్తిగా అవకాశాలు తగ్గిపోయాయి అంతేకాకుండా ఆమె క్యాన్సర్ బారీన పడినట్లు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న సోనాలి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు, తరువాత మెలమెల్లగా కాస్తా కుదుటపడినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఎవరైనా క్యాన్సర్ అని తెలియగానే కృంగిపోతారు, కానీ సోనాలి(Sonali Bindre) మాత్రం ఆలా కుంగిపోకుండా ఎంతో ధైర్యం గా ఫైట్ చేస్తుంది. తన బాధని తనలోనే దాచుకొని ఆనందంగా ఉంటుంది, మొదట్లో సోనాలి కూడా చాలా బాధని అనుభవించారు ఇప్పుడిప్పుడే ఆ బాధనుండి కొల్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదలగున్నవాటి గురించి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

జీవితంలో వెలుగు చీకటి అనేవి రెండు చాలా ముఖ్యం , వెలుగు వెంటనే నీడ కూడా ఉంటుంది, అలాగే కష్టం వెనుకే సుఖం ఉంటుంది కష్టం గా ఉంది అని దాన్ని వదిలేస్తే సుఖం కూడా దక్కకుండా పోతుంది. సో జీవితంలో ఏది శాశ్వతం కాదు ఏదైనా మనతో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అలాగే ప్రాణాలు కూడా. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా దానితో పోరాడాలి, ఎదిరించాలి, సుఖం వచ్చినపుడు సేదతీరుతునే.. కష్టం రాకుండా చూసుకోవాలి. జీవితం అనే రణరంగంలో ఒక సైనికుడిలా నిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి అప్పుడే గెలుపు మన వాకిట నిలుస్తుంది. మనం ఏ రంగంలోకి వెళ్ళిన కూడా అక్కడ గెలుపే ముఖ్యం, దానిలో గెలిచినవాడే కింగ్ అందులోనే ఉంటుంది సుఖం, ఇది అంత ఎందుకు చెప్తున్నాను అంటే నా జీవితం నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలని సోనాలి తన ట్విట్టర్లో తెలిపింది. ప్రస్తుతం సోనాలి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల సంఖ్యలో షరెస్ వెళ్తున్నాయి.

 

s

You might also like