Saakshyam
Nothing scared but the truth

రాయలసీమ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి: నవీన్ కుమార్ రెడ్డి

Should provide job opportunities for Rayalaseema students

0

Should provide job opportunities for Rayalaseema students | telugu news

రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ నాయకులు రవి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో 4వ మహాసభలు జరిగాయి.దీనికి ముఖ్య అతిథిగా (Should provide job opportunities for Rayalaseema students) కాంగ్రెస్ నాయకులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ ఐఎన్టియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ వెనకబాటుతనం గురించి విద్యార్థులకు వివరించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల గత 60 ఏళ్లుగా వెనుకబాటుకు గురవుతున్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.

Should provide job opportunities for Rayalaseema students

ఈ సంధర్బంగా ఆయన టిటిడిలో ఖాళీగా ఉన్న ఎనిమిది వేల ఉద్యోగాలను స్థానికులతో పాటు రాయలసీమ ప్రాంత యువతకు మాత్రమే కల్పించి రాయలసీమ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసారు. జిల్లాలోని సత్యవేడు శ్రీ సిటీ లోని పరిశ్రమలలో కొంత భాగాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం దుర్మార్గం అని ఇలాంటి పనులు మానుకోవాలని నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శ్రీ సిటీ లోని ఉద్యోగ ఉపాధి అవకాశాలలో చిత్తూరు జిల్లా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వాన్ని కోరారు.

Should provide job opportunities for Rayalaseema students

విభజన చట్టంలోని హామీ ప్రకారం అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు.రాయలసీమ ఇంకెన్నాళ్లు ఇలా వెనకబడుతున్న ప్రాంతం లాగానే ఉండాలా అని విద్యార్థులను ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరోసారి విభజనకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4 జిల్లాల విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like