Saakshyam
Nothing scared but the truth

ఎల్బీనగర్ లో విజయం దిశగా శేఖర్జీ

Shekharji has good chances to win Lb Nagar

0

Shekharji has good chances to win Lb Nagar | Telugu political news

సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఎల్బీ నగర్ బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు. నియోజకవర్గం లోని (Shekharji has good chances to win Lb Nagar) ప్రతి ఇంటి గడప తడుతూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని మిగతా అభ్యర్థుల కంటే ముందున్నారు. విద్యావంతుడు మరియు సామాజిక బాధ్యత తెలిసిన వ్యక్తి కావడంతో అన్ని వర్గాల నుండి విశేష స్పందన వస్తుంది. దాదాపుగా శేఖర్జీ గెలుపు నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శేఖర్జీ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ దేశం లోని వివిధ రాష్ట్రాల వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ  నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, వ్యాపారులు అధికారులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారని అన్నారు. ఓ వైపు విజయవాడ జాతీయ రహదారి ఇంకోవైపు నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారి కి ఇరువైపున్న ఈ  కాలనీలు, బస్తీలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కి ఆమడ దూరం ఉండడం నిరాశాజనకంగా ఉందన్నారు. దీనికి కారణం ఇన్ని రోజులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, నాయకుల నిర్లక్ష్యం అని విమర్శించారు. ఎల్బీ నగర్ సమగ్ర అభివృద్ధి  కోసం నేను మనసా, వాచా, కర్మణా ఉంటానని మీకందరికీ వాగ్దానం చేస్తున్నానని అన్నారు.

Shekharji has good chances to win Lb Nagar | Telugu political updates

అసలు ఒక ప్రజా ప్రతినిధి నుండి ప్రజలు కోరుకొంటున్నదేమిటి? ఒక్కసారి ఆలోచించండి రాజకీయ వ్యాపారులా లేకా రాజకీయ సేవకులా అని ప్రశ్నించారు. ప్రజలు ఆనందంగా జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజా ప్రతినిధి పై ఉన్న కనీస బాధ్యత అని తెలిపారు. కావున ప్రతి ఒక్క ఓటర్ సామజిక బాధ్యతనెరిగి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కమలం పువ్వు గుర్తుకి ఓటేసి ఎల్బీ నగర్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like