Saakshyam
Nothing scared but the truth
Page Right

జగనన్నకు తోడుగా జగమంత కుటుంబం – శైలజా చరణ్ రెడ్డి 

0

Shailaja reddy, Jagan, Ysrcp

జగమంత కుటుంబాన్ని నా తండ్రి నాకు ఇచ్చి వెళ్ళాడు, వారి సాధక బాధకాలు  చూడాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి వారి సమస్యలను ఎజెండాగా మార్చుకొని  సమస్యల సాధికారత కై  ప్రజల్లో ఉంటేనే వారి బాధలు బాధ్యతలు అన్నీ తెలుస్తాయి  అనే మంచి ఉద్దేశంతో చేపట్టిన యాత్రనే ప్రజాసంకల్పయాత్ర అని జగనన్న(jagan) ఎన్నో సందర్భాల్లో తెలిపారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్ శైలజా చరణ్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  ఇన్ని రోజులు పాదయాత్ర చేయడం జగన్ మోహన్ రెడ్డి వలన మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు అందరూ ముక్తకంఠంతో ఆయనకు అభినందనలు తెలపడం నిజంగా హర్షదాయకం అన్నారు.

ఏడాది కాలంలోని యాత్రలో  ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు  ప్రజా సమస్యలను క్షుణ్ణంగా పరిగణలోకి తీసుకుంటూ  సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలను అక్కడే పరిష్కరిస్తూ  వారికి భరోసా నింపుతూ ముందుకు సాగుతున్న జగనన్న  మీకు, మీ పాద చరణములకు మా అభివందనములు అంటూ  కృతజ్ఞతలు తెలియజేశారు.  పాలకపక్షం కక్ష కట్టి పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు  సృష్టించినప్పటికీ   బ్యానర్లను చించివేయడం,  జగన్ నడిచిన దారిలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధి   చేయడం,  యాత్ర జరిగిన జిల్లాలో జగన్ దగ్గరకి ప్రజలను రానివ్వకుండా అడ్డుకోవడం,  తేనెటీగలతో దాడి చేయించడం ఇవేమీ ఆయన పాదయాత్రను అడ్డుకోవడం వీలు కాకపోవడంతో జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ఇన్ని చేసినా సహనం, ఓపికతో ప్రజలకు మంచి చేయాలనే దృఢ నిశ్చయంతో తనపై దాడులను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం నేనున్నానంటూ బయలుదేరిన జగన్ కి జగమంతా కుటుంబం అండగా నిలబడడానికి సిద్ధమైంది. జగన్ సీఎం అయ్యే వరకు వెంట ఉంటామని మాటిస్తున్నామని స్పష్టం చేశారు.

Click here : ఆ పార్టీ తరుపున ఎన్నికల బరిలోకి దిగనున్న చిరంజీవి..?

You might also like