Saakshyam
Nothing scared but the truth

కమల్ హాసన్ సంచలన నిర్ణయం

Sensational Decision By Kamal Hassan || Telugu Cinema News || Saakshyam.com

0

Sensational Decision By Kamal Hassan || Telugu News || Saakshyam

నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కమల్ హాసన్ (Sensational Decision By Kamal Hassan) తన సినీ ప్రస్థానంకు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించాడు. కమల్ హాసన్ కొన్నాళ్ల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేసి మక్కల్ నీధి మయ్యం పార్టీని స్థాపించిన విషయం తెల్సిందే. తమిళనాట క్రియాశీలక రాజకీయాలలో చురుకుగా ఉండేదుకు కమల్ హాసన్ తన సినీ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. రాజకీయ నాయకుడి పాత్రను పూర్తి స్థాయిలో నెత్తికి ఎత్తుకునే సమయం ఆసన్నమైందని ప్రకటించాడు.

భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు -2 రూపొందబోతున్న విషయం తెల్సిందే. విభిన్నమైన కథాంశంతో కమల్ రాజకీయ ఇమేజ్ ను పెంచే విధంగా ఆ చిత్రం ఉంటుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇండియన్ 2 చిత్రంతో తన సినీ కెరీర్ కు గుడ్ బై చెప్తే అర్థం పరమార్థం ఉంటుందనే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

Sensational Decision By Kamal Hassan || Tollywood Gossips || Saakshyam

ఇప్పటి నుండే పూర్తి రాజకీయాల్లోకి వెళ్లాలని కమల్ భావిస్తున్నాడు. కమల్ హాసన్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తర్వాత ఏడాది వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వాలనేది కమల్ కోరిక. అందుకు సినిమాల్లో ఉంటే సాధ్యం కాదని ఇండియన్ 2 చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా కమల్ ఒక ప్రకటనలో తెలియజేశాడు. డిసెంబర్ 14న సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. కాజల్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ చిత్రం  తమిళనాడు ఎన్నికల ముందు విడుదల అయ్యేలా ప్లాన్ చేయబోతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here: మురుగదాస్ తో రజనీ సినిమా

You might also like