Saakshyam
Nothing scared but the truth

కలెక్షన్స్ ఏంటీ ఇంత చండాలంగా ఉన్నాయి….!

0

Chaithu Savyasachi Total Collection |  Cinema news

అందరు అనుకున్నట్లుగానే సవ్యసాచి ఒక డిజాస్టర్ గా మిగిలిపోతుందేమో అన్న అనుమానాలు కలగడం తప్పడం లేదు ఎందుకంటే కలెక్షన్స్ అలా ఉన్నాయి మరి. గత వారం విడుదలలైన సవ్యసాచి మొదటిరోజు టాక్ బాగానే వచ్చింది కాని సాయత్రం అయ్యే సరికి సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నది ఇక కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. సరే వీకెండ్ లో కలెక్షన్స్ జోరు షురు అవుతుందిలే అని భావించారు కాని వీకెండ్స్ కూడా బోల్తా కొట్టించాయి కనీసం పెట్టినదానిలో సగం కూడా రాలేదు, అలాంటప్పుడు సినిమాని డిజాస్టర్ అని కాకా ఇంకేమనాలి. మొదటిరోజు రూ.4.15 కోట్ల షేర్ రాబట్టిన ‘సవ్యసాచి’ (Savyasachi Total Collection) .. తర్వాతి రెండు రోజులూ కలిపి వసూలు చేసింది 3.5 కోట్లు మాత్రమే. మొత్తంగా తొలి మూడు రోజుల వారాంతంలో ఈ చిత్రం రూ.7.65 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టింది.

Savyasachi Total Collection | Telugu movies

ఇదే కలెక్షన్స్ ని ఏరియా వైజ్ గా చూసుకుంటే నైజం ఏరియాలో రూ.2.13 కోట్ల షేర్ తెచ్చిన ‘సవ్యసాచి’.. రాయలసీమలో రూ.91 లక్షలే వసూలు చేసింది. వైజాగ్‌లో రూ.92 లక్షలు.. మిగతా ఆంధ్రా ఏరియాలన్నీ కలిపి రూ.2.1 కోట్లు రాబట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.10.7 కోట్ల గ్రాస్.. రూ.6.07 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఇవే కలెక్షన్స్ యూఎస్ లో చూసుకుంటే రూ.2 కోట్ల గ్రాస్.. రూ.74 లక్షల షేర్ వచ్చింది. మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.75 లక్షల షేర్ వచ్చింది. మొత్తంగా వరల్డ్ వైడ్ తొలి వీకెండ్లో రూ.15.2 కోట్ల గ్రాస్.. రూ.7.65 కోట్ల షేర్ తెచ్చింది ‘సవ్యసాచి’. అయితే సవ్యసాచి కి పెట్టిన మొత్తం రూ.22.5 కోట్లకు అమ్మారు.

కాని ఇప్పటివరకు కల్లెక్షన్స్ గనుక చూసుకుంటే వాటిలో మూడవ వంతు కూడా రాలేదు అని తెలుస్తుంది. పెళ్లి తరువాత చైతు చేసిన మూడవ సినిమా సవ్యసాచి ఇక మొదటి రెండు సినిమాలు కూడా డిజాస్టర్ నే అందుకున్నాయి. చైతు పెల్లికిముందు చేసిన సినిమాలలో ఒకటో రెండో తప్ప మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించాయి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు కాని పెళ్లి తరువాత చైతు చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ నే అందుకున్నాయి. దిన్ని బట్టి చూస్తుంటే చైతు ఇమేజ్ మొత్తం కూడా గల్లంతే అన్నట్లుగా ఉంది, చైతు కి ఈ సమయంలో ఒక హిట్ పడాలి లేదంటే ఇక ఇండస్ట్రీ లో కెరీర్ గల్లంతే అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : నేను చైతు కలవలేకపోతున్నాం ఇదంతా సమంత రావడం వలనే…?

You might also like