Saakshyam
Nothing scared but the truth

‘సర్కార్’ రివ్యూ అండ్ రేటింగ్…!

0

Thalapathy Vijay, Sarkar, Review,  Rating

తారాగ‌ణం: విజ‌య్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, యోగిబాబు, రాధార‌వి త‌దిత‌రులు
మాట‌లు: శ్రీరామ‌కృష్ణ‌
పాటలు: చ‌ంద్ర‌బోస్‌, వ‌న‌మాలి
సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
ఛాయాగ్ర‌హ‌ణం: గిరీశ్ గంగాధ‌ర‌న్‌
కూర్పు: శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్‌

విజ‌య్‌(Thalapathy Vijay), ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తుపాకి, క‌త్తి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత రూపొందిన హ్యాట్రిక్ చిత్రం `స‌ర్కార్‌`. సామాజిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాన ఇతివృత్తంగా తీసుకుని త‌న‌దైన శైలిలో క‌మ‌ర్షియ‌ల్‌ఫార్మేట్‌లో సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ముర‌గ‌దాస్ దిట్ట‌. స‌ర్కార్ సినిమాలో కూడా ఓటు విలువ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజ‌య్‌ను ఓ బిజిన‌స్ టైకూన్‌గా చూపిస్తూనే ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని ఎన్నుకోవాలి అనే పాయింట్‌లో క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్‌. విజ‌య్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన స‌ర్కార్ త‌న‌కు ఎలాంటి విజ‌యాన్ని అందించిందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం…

కథ :
సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలోనే నెం.1 కంపెనీకి సి.ఇ.ఓ. తన జీవితంలో తన తండ్రీ మరణం తాలూకు సంఘటన కారణంగా సుందర్ రామస్వామి ఓటుకి ఎంతో విలువ ఇస్తాడు. ఈ నేపధ్యంలో తన స్వంత రాష్ట్రం అయిన ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ష్ జరుగుతాయి. దీంతో సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తన ఊరికి వస్తాడు. కానీ అప్పటికే సుందర్ ఓటును ఎవరో దొంగ ఓటుగా వెయ్యటం జరుగుతుంది. దీనిపై సుందర్ కోర్టుకు వెళ్లి.. తన ఓటు సంగతి తేలే వరకు ఎలక్షన్ రిజల్ట్స్ ఆపేలా చేస్తాడు. ఆ తర్వాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కోర్టు జరిగిన ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని ఆర్డర్ వేస్తుంది. ఆ తరువత జరిగే పరిణామాలు ఏమిటి ? సుందర్ రామస్వామి, ఓటు హక్కు పై ప్రజల్లో ఎలాంటి చైతన్యం తీసుకు వచ్చాడు ? ఈ క్రమంలో అవతల రాజకీయ పార్టీ లీడర్ కోమలవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్) సుందర్ ను అడ్డుకోవడానికి ఏమి చేసింది ? ఎన్ని ఎత్తులు వేసింది ? వాటిని సుందర్ రామస్వామి ఎలా ఎదురుకున్నాడు ? చివరకు సుందర్ రామస్వామి అనుకున్నది సాధించాడా ? లేదా ? లాంటి విషయాలు తెలయాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

* పొలిటికల్ డ్రామా
* ఎమోషనల్ సీన్స్
* యోగిబాబు కామెడీ
* చెప్పాల‌నుకున్న పాయింట్ కొత్త‌దే
* విజయ్ నటన

మైనస్ పాయింట్స్ :

* సినిమాలో స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డం
* సెకెండాఫ్
* ప్రీ క్లైమాక్స్
* ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే పాయింట్స్ లేవు

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. తన మార్క్ డైరెక్షన్ తో అక్కడక్కడ ఆకట్టుకున్నారు. కానీ కథనం మాత్రం ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయారు. ఏ ఆర్ రహమాన్ అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేకపోయినా.. కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలోని లాజిక్ లేని సన్నివేశాలకు క్లారిటీ ఇచ్చే సీన్స్ ని కూడా ఉంచి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

సాక్ష్యం రేటింగ్ : 2.5/5

You might also like