Saakshyam
Nothing scared but the truth

సర్కార్ మార్నింగ్ షో టాక్…సినిమా హిట్టా ఫట్టా..?

0

Thalapathy Vijay Sarkar Morning show | Cinema news

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదటి షో  (Sarkar Morning show) చూసుకుంటే మంచి టాక్ తో నడుస్తుందని అర్ధమౌతుంది. విజయ్  అంటే మరి మాత్రం ఉండాలి కదా…సరే సినిమా ఎలా ఉందో వివరాల్లోకి వెళ్తే…ఈ సినిమాలో ఒక పెద్ద కంపెనీ కి సీఈఓ గా విజయ్ , సుందర్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. కధ ఇప్పుడు హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యింది ఇక్కడ కీర్తి సురేష్ విజయ్ మరదలుగా పరిచయం చేయబడుతుంది ఇద్దరి మధ్య కొన్ని లీలా సన్నివేశాలు జరుగుతున్నాయి, ఇక ఇప్పుడు సినిమా మెల్లగా కధలోకి వెళ్ళిపోయింది దొంగ ఓటుకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి, ఇక ఈ సమస్య పై సుందర్ దృష్టి పెట్టి వాటిని కోర్ట్ ద్వారా తిర్చలనుకుంటాడు, ఇక రాధా రవి సీనియర్ రాజకీయ నాయకుడిగా పరిచయం చేయబడ్డారు.

Sarkar Morning show | Telugu movies

మొత్తానికి విజయ్ కేసు గెలిచాడు అనుకున్నది సాధించాడు, ఇక ఇక్కడ ముఖ్యమంత్రి కూతురిగా వరలక్ష్మి సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది, సెక్షన్ 49పి ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయ్ కీలక పాత్ర వహించాడు. ఓటు ఎంత ముఖ్యమైనదో అని విజయ్ ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు.విజయ్ ఓటును వినియోగించుకున్న పాత్రలో కమెడియన్ యోగిబాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ ఇలా ప్రజలకు దగ్గరౌతు దొంగ ఓట్ల గురించి వివరిస్తున్న నేపధ్యం వరలక్ష్మి కి అతని తండ్రికి నచ్చలేదు దాంతో వరలక్ష్మి అమెరికా నుండి తన తండ్రికి సయం చేస్తూ ఉంటుంది, ఎలక్షన్స్ ఫలితాలు చెల్లుబాటు కాలేదు. 15 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కోర్ట్ ఆర్డర్ వేసింది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలా విజయ్ దొంగ ఓట్ల పైన దృష్టి పెట్టి కేసుని గెలవడం అలా జరిగిపోయింది ఇప్పుడు అసలు కధ మొదలౌతుంది, శివ శంకర్ మాస్టర్ నామినేషన్ ఆఫీసర్ గా సీన్ లోకి వచ్చారు .ఎన్నికల్లో సపోర్ట్ కోసం ప్రజల సాయం తీసుకుంటున్నాడు విజయ్.

సెకండ్ పార్ట్ మొత్తం కూడా రాజకీయాలపైనే జరుగుతూ ఉంటుంది, రాజకీయాలు మరింత రసవత్తరంగా కొనసాగుతుండడంతో వరలక్ష్మి ఇండియాకి చేరుకుంటుంది, ఇక్కడికి వచ్చి తన తండ్రికి రాజకీయంగా సాయం చెయ్యడానికి వస్తుంది ఇక్కడ కధ మరింత పుంజుకుంది, వేడివేడిగా రాజకీయాలు జరుగుతున్నాయి, ఇక్కడ విజయ్ కి వరలక్ష్మి కి మధ్య కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంతలో ఎలెక్షన్ రోజు రానే వచ్చింది, ఇద్దరు కూడా పోటాపోటిగా పోటి పడుతున్నారు, ప్రస్తుతం హై వోల్టేజ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ వస్తుంది.. మొత్తానికి విజయ్ అనుకున్నది సాధించాడు సమాజానికి తను ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నాడో అనుకున్నట్లుగానే సమాచారం అందించాడు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : ఎందుకు విజయ్ దేవరకొండ నీకు ఇంత కష్టం వచ్చింది…!!

You might also like