Saakshyam
Nothing scared but the truth
Page Right

365 రోజులు 3211 కిలోమీటర్లు… జగన్ ప్రజాసంకల్ప యాత్ర పై సాక్ష్యం ప్రత్యేక కథనం 

YS Jagan Praja Sankalpa Yatra | Latest news | Saakshyam

0

YS Jagan, Praja Sankalpa Yatra,

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారి రక్తం లోనే ఉన్నది కాబోలు అందుకే తండ్రి ఆశయ సాధనకై నడుం బిగించి ప్రజా సంక్షేమం కోసం పాదయాత్ర చేస్తున్నారు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు అయిన జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాల సాధనకై కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాసేవలో ప్రాణాలు వదిలిన వైఎస్సార్ మరణంతో కృంగిపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తండ్రి ఆశయాలను సాధించడానికి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న జగన్ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ మరణం తరువాత ఎంతోమంది తనపై కుట్రలు, కుతంత్రాలతో అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం ప్రజాసేవే పరమావధిగా భావించి గత ఏడాది ఇదేరోజున ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారు.

prajasankalpa-yatra | saakshyam.comప్రజల్లో జగన్ మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేని అధికార పార్టీ నాయకులు ఎన్ని అడ్డంకులు ఏర్పరిచిన చివరికి తననే అంతమొందించాలని హత్యాయత్నం చేయించినప్పటికీ వాటన్నిటినీ పట్టించుకోకుండా చిరునవ్వు చిందిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎంతమంది తనను తుదముట్టించి రాజకీయ క్షేత్రంలోనే లేకుండా చేయాలనీ చూసినా ప్రజా బలంతో ప్రజా క్షేత్రంలో ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడినా ప్రజలకు మంచి చేయాలనే తన ఆశయాన్ని ఏమీ చేయమంటూ ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర, ప్రజల్లో ఆయనకు వస్తున్నా ఆదరణ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెడుతారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

jagan | saakshyam.comజగన్ ప్రజా సంకల్ప యాత్ర వివరాలు :

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan)చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేటికీ సంవత్సరం పూర్తికి చేసుకున్న సందర్బంగా మొత్తం అయన పర్యటించిన ప్రాంతాల వివరాలు… రాష్ట్ర భవిష్యత్తు కోసం 365 రోజుల నుండి పాదయాత్ర చేస్తున్న జగన్ ఇప్పటి వరకు 3211  కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 1739 గ్రామాల్లో సాగిన ఈ పాదయాత్ర 205 మండలాలు, 122 నియోజకవర్గాల్లో 47 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు 12 జిల్లాల్లో కొనసాగింది. మొత్తం ఇప్పటి వరకు 113 బహిరంగ సభలతో పాటు 42 ఆత్మీయ సదస్సులు నిర్వహించారు. వెళ్లిన ప్రతిచోటా జన నేతకు ప్రజలు నీరాజనాలు పట్టారు.

auto-jagan | saakshyam.com

 

Click here : కేసీఆర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రాములమ్మ

You might also like