Saakshyam
Nothing scared but the truth

ఈసారి నేను గనుక ఓడితే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా : రేవంత్

0

కోడంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు తనపైన ఎన్ని కుట్రలు పన్నినా కూడా అవన్నీ తనని ఏమి చెయ్యలేవని ఎన్ని సార్లు అన్యాయంగా జైలుకు పంపిన కూడా ఈసారి ఎన్నికల్లో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న మోసాలను ఇకపై జనాలు నమ్మబోరు అంటూ కోడంగల్ పౌరుషానికి, కేసీఆర్ కి మధ్య జరుతున్న యుద్ధం లో తనని ఓడించడం ఎవరి తరం కాదని వ్యాఖ్యలు చేశారు, ఒకవేళ తను గనుక ఈ యుద్ధం లో ఓడిపోతే ఇక రాజకీయాలనుండి శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం నియోజకవర్గంలోని కొడంగల్‌, బొమ్మరా్‌సపేట, దౌల్తాబాద్‌, మద్దూరు, కోస్గి మండల కేంద్రాలు, పలు గ్రామాల్లో ఆయనరోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ భుజాలపైన పెట్టుకొని మోయడంతో ఇంతటి వాడినయ్యను, ఇకపైన కూడా మీ అభిమానం నాకు కావాలి, ఢిల్లీ నుండి గల్లి వరకు కొడంగల్‌ పేరును వినిపించి రాహుల్‌గాంధీని కోస్గికి తీసుకువచ్చాను.

నిన్న మొన్న ఒకడొచ్చి.. తాను మీ ఊరికి అల్లుడినని చెబుతున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా వచ్చి మీ కష్టాల గురించి అడిగాడా?’ అని రేవంత్‌ అన్నారు. నేను అప్పటికి ఇప్పటికి కోడంగల్ జిల్లాకి పెద్ద కొడుకుని కోడంగల్ కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను, ఎవరికీ ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను, అందరి కష్టాలలో అండగా ఉంటాను, కేసీఆర్‌ను గతంలో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా గెలిపిస్తే పదవిలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారైనా కొడంగల్‌ గడ్డపై కాలుపెట్టలేదని, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చాడని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంను అవమానించేంత గొప్పవాళ్లయ్యారా? అని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లగడపాటి రాజగోపాల్ తో కలిసి ఎప్పటికప్పుడు కేటీఅర్ చీకటి రాజకీయాలు నడుపుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు.

ఇక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం లోకి రాబోయ్యేది ఇందిరమ్మ రాజ్యమని ఆమె రాకతో జనాలు ఆనందంగా ఉంటారని రేవంత్ తెలిపారు. కేసీఆర్ నాపైన కక్ష కట్టి ఎప్పటికప్పుడు నన్ను రాజకీయంగా అనిచివేయ్యలని చూస్తున్నారని, కానీ అది అతని తరం కాదని తేల్చి చెప్పేశారు. కొడంగల్‌ అభివృద్ధి కోసం అనుమతులు తెచ్చిన లిప్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని, కళాశాలల మంజూరును, కోయిల్‌సాగర్‌ తాగునీటిని కేసీఆర్‌ అడ్డుకుని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ బండారం మొత్తం కూడా బట్టబయలు చేశారు.

You might also like