Saakshyam
Nothing scared but the truth

సెంచరీ కొట్టనున్న తెరాస

Recent survey predicts TRS party wins 100 seats

0

Recent survey predicts TRS party wins 100 seats | Telugu Political news

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలలో తెరాస 100 స్థానాలకు అటు ఇటుగా గెలుస్తుందని, ప్రతిపక్ష కూటమి కి 16-21 సీట్లు మాత్రమే వస్తాయని, రెండున్నర లక్షల మందికి పైగా (Recent survey predicts TRS party wins 100 seats) ఓటర్లతో సిపిఎస్ సంస్థ జరిపిన తాజా సర్వే చెప్పింది. వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో సీట్లలో తేడా వచ్చినా చివరకు టిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని తమ సర్వేలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సోమవారం సిపిఎస్ (సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) అనే సంస్థ తాము చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఓటర్లు టిఆర్‌ఎస్ పార్టీకా, మహాకూటమికి పట్టం కడతారా అన్న విషయమై సిపిఎస్ సంస్థ సర్వే నిర్వహించింది.

సర్వేలో రెండున్నర లక్షలకు పైగా ప్రజలతో ఆ సంస్థ సభ్యులు మమేకమై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. దీనికోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఈ సర్వేలో టిఆర్‌ఎస్ ఎదురులేదని మరోసారి రుజువుచేసింది. ఈ ఎన్నికల్లో అనుకూల, ప్రతికూల అంశాలపై అభిప్రాయ సేకరణ ఈ సంస్థ జరిపింది. ప్రచారశైలి, సామాజిక వర్గం, టిఆర్‌ఎస్‌కు, మహాకూటమికి ఉన్న అనుకూలత వంటి వాటిని తమ ప్రశ్నావళిలో ఈ సంస్థ పొందుపరిచింది. ఈ ఫ్రీ పోల్స్ ఆధారంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో, మెజార్టీ ఓట్లు సాధిస్తారో సర్వే తేల్చింది. టిఆర్‌ఎస్‌కు మహాకూటమికి ఓట్ల శాతంలో భారీ తేడా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.

Recent survey predicts TRS party wins 100 seats | Telugu news

మొత్తం 119 స్థానాలకు గాను 100 సీట్లు గెలుస్తామని ముందునుంచి కెసిఆర్ చెప్పినట్టుగానే సర్వేలో కూడా వాస్తవాలు వెల్లడికావడం గమన్హారం. దీనిని సైంటిఫిక్ నిర్వహించినట్టుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సిపిఎస్ సంస్థ జరిపిన ఈ సర్వేలో 52.7 శాతం పురుషులు, 47.3 శాతం మహిళల నుంచి ఈ సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. కీలక సమయంలోనే ఈ ప్రీ పోల్స్‌ను నిర్వహించామని ఈ సంస్థ పేర్కొంటుంది. టిఆర్‌ఎస్‌కు (49.7 శాతం మంది) మహాకూటమికి 32.3 శాతం మంది, బిజేపికి (9.1 శాతం) మంది, ఎంఐఎంకు (2.4 శాతం మంది), ఇతరులకు (6.5 శాతం మంది) ఓటర్ల మద్ధతు ఉన్నట్టు ఈ సర్వేలో పేర్కొంది. 50.8 శాతం మంది పురుషులు టిఆర్‌ఎస్ వైపు ఉండగా, 48.4 శాతం మంది మహిళా ఓటర్ల మద్ధతు ఈ పార్టీకి ఉన్నట్టు లెక్కగట్టింది ఈ సంస్థ.

సర్వే వివరాల ప్రకారం టిఆర్‌ఎస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని, మహాకూటమి పార్టీకి 16 నుంచి 21 సీట్లకే పరిమితం కానుందని, బిజేపికి 1 నుంచి 2 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు 07 సీట్లు వస్తాయని , ఇతరులు 1సీటును గెలుచుకుంటారని ఈ సర్వే రిపోర్టులు తేల్చాయి. దీనికోసం 52,86,567 మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ సర్వే రిపోర్టును వెల్లడించిండి సిపిఎస్ సంస్థ. నవంబర్ 25వ తేదీ నుంచి 29వ తేదీల మధ్య ఉమ్మడి పది జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో సిపిఎస్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అభ్యర్థితో పాటు పార్టీని లెక్కలోకి తీసుకొని ఈ అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావం చూపుతాయో కూడా ఈ సంస్థ తన సర్వే నివేదికలో పేర్కొంది. టిఆర్‌ఎస్‌కు కెసిఆర్ ఇమేజ్ వలన 38.5 శాతం అదనంగా కలిసివచ్చే అంశంగా సర్వేలో ఈ సంస్థ పేర్కొంది. ఇక మహాకూటమి విషయానికి వస్తే ఉత్తమ్. ఎల్.రమణ, కోదండరాం వలన 13.2 శాతం మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు కలిసివస్తుందని, మహాకూటమిలోని ముఖ్య నేతలు ఓడిపోతారని ఈ సంస్థ పేర్కొంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here: తనిఖీల్లో దొరికిన 5 కోట్లు

You might also like