Saakshyam
Nothing scared but the truth

అదుగో రివ్యూ అండ్ రేటింగ్…!

0

Ravi babu, Adugo Movie, Review and Rating

నటీనటులు : బంటి, అభిషేక్ వర్మ, నాభ నటేష్ , రవి బాబు తదితరులు

దర్శకత్వం : రవిబాబు

నిర్మాత : రవిబాబు , సురేష్ ప్రొడక్షన్స్

సంగీతం : ప్రశాంత్ విహారి

స్క్రీన్ ప్లే : రవిబాబు

దర్శకడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’(Adugo Movie). అభిషేక్ వర్మ, నాభ నటేష్ జంటగా నటించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందోసమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

క‌థ‌:
ఓ పంది త‌న పిల్ల‌కు క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా స్టార్ట్ అవుతుంది. గ‌న్న‌వ‌రంలోని చంటి.. ఓ పంది పిల్ల పెంచుకుంటూ ఉంటాడు. దానికి బంటి అని పేరు కూడా పెట్టుకుంటాడు. అయితే ఓ ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ పంది పిల్ల‌ను ఎత్తుకుని పారిపోతారు. చంటి వారి వెంటే బంటిని వెతుక్కుంటూ వ‌స్తుంటాడు. మ‌రో వైపు సిక్స్ ప్యాక్ శివ‌(ర‌విబాబు), బెజ‌వాడ దుర్గ మ‌ధ్య వెయ్యి ఎక‌రాల‌కు సంబంధించిన డీల్ గొడ‌వ జ‌రుగుతుంటుంది. మ‌రో వైపు గుట్కా వ్యాపారం చేసే గంగరాజుకి , అమ్మాయిల‌ను అక్ర‌మంగా షార్జాకు పంపే శంక‌ర్‌కు మ‌ధ్య ఆధిప‌త్య‌ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. అలాగే అభిషేక్(అభిషేక్ వ‌ర్మ‌)కి ఉద్యోగం చేయ‌డం ఇష్టం ఉండ‌దు. చౌక ధ‌ర‌కు ఓ మొబైల్‌ను త‌యారు చేయాల‌నుకుంటూ ఉంటాడు. అత‌ని ల‌వ‌ర్ రాజి(న‌భా)ను పెళ్లి చేసుకోవాల‌నుకుంటే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అయితే ఎవ‌రో కొంద‌రు రాజిని కిడ్నాప్ చేస్తారు. అస‌లు వారెంద‌రు రాజిని కిడ్నాప్ చేస్తారు. పైన చెప్పిన మూడు నాలుగు గ్యాంగులు, అభి, రాజి, చంటి, బంటిల‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్ :

* నాభ నటేష్ గ్లామర్
* బంటి(పండి పిల్ల)
* రవిబాబు కామెడి టైమింగ్

మైనస్ పాయింట్స్ :

* ప్లో లేని సీన్లు
* లాజిక్ లేని సీన్స్

సాంకేతిక విభాగం :

దర్శకుడు రవిబాబు పేపర్ మీద రాసిన స్క్రిప్ట్, స్క్రీన్ మీద ఆయన విజన్ కి తగ్గట్లు సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. పైగా ఆయన రాసుకున్న కథకథనాల్లో సహజత్వం కూడా లోపించింది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం కొన్ని సన్నివేశాలల్లో పర్వాలేదనిపిస్తుంది.ప్రశాంత్ విహారి అందించిన పాటల్లో పూర్ణ పాట ఆకట్టుకుంటుంది. ఆయన అందించిన నేపధ్య సంగీతం సినిమాకి తగ్గట్లు సాగింది. ఎడిటర్, దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. కథకు తగ్గట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి.

సాక్ష్యం రేటింగ్ : 2/5

Click here : డాన్ బాస్కో ప్రోమో ఆదరగోట్టేస్తుంది…!!

You might also like