Saakshyam
Nothing scared but the truth

2.ఓ రివ్యూ అండ్ రేటింగ్…!!

0

స్టార్ కాస్ట్ : రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ తదితరులు..
దర్శకత్వం : శంకర్
నిర్మాతలు: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
మ్యూజిక్ : ఏ ఆర్ రహమాన్

సూపర్ స్టార్ రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 2.ఓ. సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ విజువల్ వండర్ మూవీ ఈరోజు (నవంబర్ 29 ) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీఫై అన్ని భాషల ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఈ సినిమాకోసం శంకర్, రజనీ, అక్షయ్ ఎంత కష్టపడ్డారో మనం మేకింగ్ వీడియోస్ లలోనే చూసాం. మరి వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందా..? అసలు చిట్టి రీలోడెడ్‌ ఎందుకు అవ్వాల్సి వచ్చింది..? చిట్టి కి, పక్షిరాజు (అక్షయ్) కి సంబంధం ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

చెన్నై నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ ఫోన్లు మాయమవడం మొదలవుతుంది. కారణం ప్రభుత్వానికి అంతు చిక్కదు. ఈ లోపు మొబైల్ షో రూమ్ ఓనర్ ఓ కంపెనీ సీఈఓ మినిస్టర్లు ఆ అదృశ్య శక్తి ద్వారా హత్య చేయబడతారు.దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్ వసీకరన్(రజనీకాంత్)సహాయం కోరుతుంది గవర్నమెంట్. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్ రోబో వెన్నెల(అమీ జాక్సన్)సహయంతో డిస్ మ్యాన్టిల్ చేసిన చిట్టి(రజనీకాంత్)కి తిరిగి ప్రాణం పోస్తాడు వసీకరన్. చిట్టి సహయంతో ఇదంతా గతంలో ఉరి వేసుకుని చనిపోయిన పక్షి రాజు(అక్షయ్ కుమార్)చేస్తున్నాడని తెలుస్తుంది తెలివిగా వేసిన స్కెచ్ వల్ల చిట్టి చనిపోయి వశీకరన్ శరీరంలో పక్షిరాజు ప్రవేశించి కుట్రలు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జరుగుతున్న విధ్వంసం ఆపడం కోసం 2.0(రజనికాంత్)బయటికి వస్తాడు. దాని తర్వాత 2.0కు పక్షి రాజు మధ్య భీకర యుద్ధంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

* చిట్టి – ప‌క్షిరాజు మధ్య వచ్చే సన్నివేశాలు
* విజువ‌ల్ ఎఫెక్ట్స్‌
* ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌
* నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

* సెంటిమెంట్ సన్నివేశాలు తక్కువ
* మ్యూజిక్

సాంకేతిక వర్గం:

తన ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా బలమైన సందేశం ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ మిక్స్ చేసుకునే శంకర్ ఇందులో మాత్రం కొంత తడబడ్డాడు అని చెప్పక తప్పదు. పక్షులు అంతరించిపోవడం వల్ల మానవాళికి ఎంత ప్రమాదమో హెచ్చరించే పాయింట్ లో మంచి వెయిట్ ఉంది. కాని దాన్ని కాస్త పక్కకు ఏమార్చి పక్షి రాజు మనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప ఇంకే పరిష్కారం లేదు అనేలా కథనం రాసుకోవడంతో ప్రేక్షకులకు కావల్సినంత థ్రిల్ ఇవ్వడంలో కొంత తడబాటు జరిగింది. తనలోని బెస్ట్ టెక్నీషియన్ ని శంకర్ ఇందులో మరోసారి ఆవిష్కరించాడు. అందులో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే టాప్ మేకింగ్ ని తనదైన శైలిని ఇండియన్ స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. బాహుబలి అయినా రోబో అయినా విజువల్స్ తో పాటు ఎమోషన్స్ విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి. ఇందులో అవి మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. రోబోలో చూసిన హాస్పిటల్ డెలివరీ సీన్-ఫైర్ యాక్సిడెంట్ ఎపిసోడ్ లాంటివి ఇందులో లేకపోవడంతో ఎంతసేపూ పక్షిరాజు రాక్షస ప్రవర్తన తప్ప అతనిలో సదుద్దేశం ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కదు. కథలో టెంపో లేదే అనే ఫీలింగ్ కలిగిస్తాడు శంకర్. ఆయన మీద గౌరవం కొన్ని లోపాలను ఒప్పుకోనివ్వదు కాని విడిగా చూస్తే మాత్రం 2.0 సగటు గ్రాఫిక్ మూవీలా అనిపించినా ఆశ్చర్యం లేదు. అయినా శంకర్ కు దర్శకత్వ పాఠాలు నేర్పడం అంటే గుర్రానికి నడక నేర్పడం లాంటిది. తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ తప్పకుండా ఉండేలా చూసుకునే శంకర్ ఇందులో కూడా మంచి పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే బ్లాక్ ఏదీ లేకపోవడంతో ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ దాకా కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత మైనస్ అయ్యింది.

సెల్ ఫోన్స్ మాయం కావడానికి అదృశ్య రూపంలో పక్షిరాజుకి బిల్డప్ ఇచ్చే సీన్స్ చాలా సేపు సాగదీసినట్టు అనిపిస్తుంది. స్థూలంగా చూస్తే 2.0-పక్షిరాజు మధ్య పోరాటం తప్ప ఇందులో కథేమీ లేదు. కాకపోతే ఇంత గ్రాండియర్ స్కేల్ మీద హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రెజెంట్ చేయాలన్న శంకర్ తపన మెచ్చదగినదే కానీ ఫస్ట్ పార్ట్ లాగా ఎమోషన్స్ కూడా సరైన పాళ్ళలో మిక్స్ చేసుకుని ఉంటె దీని రేంజ్ వేరుగా ఉండేది .ఏఆర్ రెహమాన్ సంగీతంలో విశేషమంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనే ఉంది. ఉన్న రెండు పాటల్లో ఒకటి ఎండ్ టైటిల్ కార్డ్స్ లో వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పడానికి ఏమి లేదు. ఇక రెండో పాట అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ లో పాథోస్ గా వస్తుంది కనక అదీ ప్రత్యేకంగా ప్రస్తావించదగినది కాదు. సో తన పనితనం మొత్తం బిజిఏంలోనే చూపించారు రెహమాన్. మెయిన్ ట్రాక్ ని రోబోదే రిపీట్ చేసినప్పటికీ దీనికి ప్రత్యేకంగా సౌండ్ ని సెట్ చేయడంలో రసూల్ పూకుట్టి పనితనం చాలా కనిపిస్తుంది.

నీరవ్ షా కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ ని చిత్రీకరించిన తీరు నభూతో అని చెప్పొచ్చు. రియాలిటీ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే క్లైమాక్స్ లో ఆయన పనితనాన్ని చూడొచ్చు. ఫైట్లు అదిరిపోయాయి. అంటోనీ ఎడిటింగ్ చాలా క్రిస్పిగా ఉంది. పాటలు లేకుండా రెండున్నర గంటల్లో విసుగు రాకుండా లాగించేసాడు. లైకా నిర్మాణ విలువలు మరీ ఆరు వందల కోట్లు అయ్యాయా అనిపించేలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్లలో మాత్రం పైసా పైసా తెరమీద కనిపిస్తుంది.రోబో సీక్వెల్ అనే ప్రచారంతో పాటు హీరోతో సహా సెటప్ మొత్తం దానినే పోలి ఉండటంతో 2.0 మీద హైప్ కు తగ్గట్టు ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకుని రావడం సహజం. 2.0 దాన్ని మరిపించేలా ఉండాలని కోరుకోవడమూ తప్పు కాదు. ఆ కోణంలో చూస్తే 2.0 హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగే కలిగిస్తుంది. కాని టెక్నాలజీ బడ్జెట్ పరంగా చాలా పరిమితులు ఉండే భారతీయ సినిమాలో ఇలాంటి ప్రయత్నం ముమ్మాటికి మెచ్చుకోదగినదే. వాటి కోసమే చూస్తే కనక 2.0 అప్ గ్రేడేడ్ వెర్షన్ గా వచ్చిన ఈ చిట్టి నిరాశ పరచడు. అరుదైన ప్రయత్నానికి సాటిస్ ఫ్యాక్షన్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల అండదండలు అవసరం

సాక్ష్యం రేటింగ్ : 3.5/5

You might also like