Saakshyam
Nothing scared but the truth

పేట రివ్యూ అండ్ రేటింగ్…!!

Rajinikanth Peta Movie Review And Rating || Telugu News || Saakshyam

Peta Movie Latest Updates || Telugu Movie News || Saakshyam

నటీనటులు : రజినీకాంత్, సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష తదితరులు.

దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ ( Rajinikanth Peta Movie Review And Rating  )

నిర్మాత : కళానిధి మారన్

సంగీతం : అనిరుద్ రవిచందర్

సినిమాటోగ్రఫర్ : యస్ తిరు

ఎడిటర్ : వివేక్ హర్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘పేట’. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దిన్ సిద్దిఖీ, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

క‌థ‌:
కాళీ(ర‌జ‌నీకాంత్‌) ఓ హాస్ట‌ల్ వార్డెన్‌గా జాయిన్ అవుతాడు. అక్క‌డ మైకేల్‌( బాబీ సింహ‌) అండ్ గ్యాంగ్ జూనియ‌ర్స్‌ను ఇబ్బంది పెడుతుంటే వారిని అడ్డుకుంటాడు. అందువ‌ల్ల మైకేల్ తండ్రి, లోక‌ల్ డాన్‌తో పెద్ద గొడ‌వ అవుతుంది. అదే స‌మ‌యంలో అన్వ‌ర్ అనే కుర్రాడి ప్రేమ మేఘా ఆకాశ్‌తో స‌క్సెస్ కావడానికి ఆమె త‌ల్లి మంగ‌ళ‌(సిమ్రాన్‌)తో మాట్లాడుతాడు. అదే స‌మ‌యంలో కోపంతో మైకేల్ తండ్రి కొంత మందిని పంపి కాళీని కొట్ట‌మ‌ని అంటాడు. కానీ కానీ వారు మైకేల్‌తో పాటు, కాళీని కూడా చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ కాళీ వారిని అడ్డుకుంటాడు. అయితే అత‌ను కాళీ కాద‌ని పేట వీర అని తెలుస్తుంది. అత‌నికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింఘా(న‌వాజుద్దీన్ సిద్ధికీ)కి పాత ప‌గ‌లుంటాయి. అస‌లు వారికి ఉన్న ప‌గేంటి? ఈ ప‌గ‌కు, అన్వ‌ర్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? చివ‌ర‌కు పేట ఏం చేశాడు? అనే విష‌యాలు తెల‌సుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్:

* రజనీకాంత్ యాక్టింగ్

* ఫస్ట్ హాఫ్

* రజనీ – సిమ్రాన్ ల సన్నివేశాలు

* మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* కథ

Peta Movie Latest Updates || Telugu Film News || Saakshyam

సాంకేతిక విభాగం :

దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా

You might also like