Saakshyam
Nothing scared but the truth
Page Right

పవన్ ఇదిగో ఇదే నీకు నా సమాధానం…!!

Polavaram Project cheaf minister clarity about on polavaram project | saakshyam

0

Polavaram Project,  cheaf minister , Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత రెండు రోజుల క్రితం పోలవరం వెళ్లి అక్కడి సమస్యలు తెలుసుకొని పేస్ బుక్ ద్వారా లైవ్ ఇచ్చి జనాలందరికీ షాక్ ని ఇచ్చారు. అంతటితో ఆగకుండా పోలవరం లో జరుగున్న కొన్ని పనులపైన పవన్ కళ్యాణ్ వ్యతిరేకత సృష్టించి ముఖ్యమంత్రి చంద్రబాబు కి ట్విట్ చేసిన సంగతి తెలిసినదే. అయితే అక్కడి సమస్యలను ఎత్తి చూపించిన పవన్ కళ్యాణ్ కి ఈరోజు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)రోడ్డు పై వచ్చిన పగుళ్ళ పై ఎలాంటి ముప్పు లేదని అయన స్పష్టం చేశారు ఆ పగుళ్ళు రావడానికి పోలవరం ప్రాజెక్ట్ కి ఎలాంటి సంబంధం లేదని ఆ రోడ్డు పగుళ్ళు రావడానికి గల కారణం కేవలం భూమిలో తేమ శాతం తగ్గడంతో ఆ పగుళ్ళు వచ్చాయని అయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వలన ఎవరి ఎలాంటి నష్టం చేకురాదని దానివలన భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

700 మీటర్ల పరిధి, ఐదు మీటర్ల లోతులో మూల లంక వెళ్లే దారిలో రోడ్డు బీటలు వారిందని..అది కేవలం వాతావరణంలో వచ్చిన మార్పులు వలన భూమిలో తేమ శాతం తగ్గడం వలనే ఇలా జరిగిందని అంతకుమించి మరేమిం లేదని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రొజెక్ట్ వెళ్ళే దారిలో రోడు మరింత బలోపేతం కావడానికి అక్కడ మట్టి మట్టిపోశామని, అయితే, బేస్ సాయిల్ లో కదిలిక రావడంతో పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. పగుళ్లకు పోలవరం ప్రొజెక్ట్ కు ఏం సంబంధం లేదన్నారు. ఇప్పటికి ఎప్పటికి పోలవరం ప్రొజెక్ట్ వలన ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని దానివలన ఆలోచించవాల్సిన అవసరం లేదని, పనులను కొనసాగించవచ్చని అటు, ఆర్టీజీఎస్ కూడా స్పష్టం చేసింది.

ఇలాఉండగా. అయితే 2 వ తారీకు పోలవరం లో కలకలం సృష్టించిన సంగతి తెలిసినదే ఎందుకంటే ఉన్నట్టుండి కిలోమిటర్ దూరం వరకు రోడ్డు పగులుడు జరగడం వలన భూకంపం వచ్చిందేమో అని జనాలు భయపడిపోయి అక్కడినుండి పరుగులు పెట్టేశారు,ఇక ఆ సమయంలో అధికారులు వచ్చి ఆ రోడ్డును తక్షణమే మూసేశారు. దాంతో పోలవరం మండలంలోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పగుళ్లపై రాష్ట్ర ప్రభుత్వ సైతం వివరణ కోరడంతో.. ఘటనా స్థలానికి ఇంజినీర్లు వెళ్లి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇక ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో పోలవరం పై విరుచుకుపడ్డారు. వెనత్నే ముఖ్యమంత్రికి ఒక లెటర్ ని రాశారు, పవన్ కళ్యాణ్ అలా లేఖ రాసారో లేదో ఒక్క రోజు గడవకతలికే ఆ విషయం పై వివరణ ఇచ్చేసారు. మొత్తానికి పోలవరం ప్రొజెక్ట్ వలన ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు అని స్పష్టం చేసేశారు.

Click here : ఫాన్స్ ఇక కలర్ ఎగరేసి తోడ కొట్టండి : శ్రీరెడ్డి

You might also like