Saakshyam
Nothing scared but the truth

‘పీహు’ రివ్యూ అండ్ రేటింగ్

Pihu Movie Review And Rating || Tollywood News || Saakshyam

0

Pihu  Review And Rating || Telugu Film News || Saakshyam

ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల చిన్నారి ఏకైక పాత్రధారిగా రూపొందించిన చిత్రం ‘పీహూ’ (Pihu  Review And Rating). ఇంట్లో అనుకోకుండా ఒంటరిగా ఉన్న చిన్నారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే అంశంతో యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. దర్శకుడు వినోద్ కాప్రి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేగాక రెండేళ్ల చిన్నారి అదీ ఏకైక పాత్రధారిగా నటించిన తొలిచిత్రం కావడంతో గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు పరిశీలనకు ఈ చిత్రాన్ని పంపించారు. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.

Pihu Movie Review And Rating || Telugu Movie News || Saakshyam

కథ : రెండేళ్ల చిన్నారి పీహూ (మైరా విశ్వకర్మ ) తల్లిదండ్రులు తరచూ గొడవపడుతూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు జరిగిన సంఘటన వలన పీహూ ఇంట్లో ఒంటరిగా ఉండిపోతుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. దీంతో ఇంట్లో ఆ చిన్నారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఒంటరిగా ఉన్న తాను ఏం చేసింది ? అసలు ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారు ? అనేది తెరపై చూడాల్సిందే.

pihu-review-and-rating | saakshyam.com

విశ్లేషణ : సినిమా మొత్తం మైరా విశ్వకర్మ పై ఆధారపడి ఉంటుంది. సహజంగా సస్పెన్స్ త్రిల్లర్ సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అదీకాక రెండేళ్ల చిన్నారితో తీసిన సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. యధార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు దీన్ని రూపొందించారు. సినిమా చూస్తున్నంత సేపు చిన్నారి ఏమైపోతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అనే భయం, టెన్షన్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. కొన్నిసార్లు కనిపించే సంఘటనలను మరీ భయంకరంగా చూపించారు. ఇక ఆకలితో చిన్నారి పడే పాట్లు, కష్టాలు చూస్తే కంటతడి పెట్టకుండా ఉండలేరు. తల్లదండ్రులకు వచ్చే పీడకల ఇది అని ట్రైలర్ ద్వారా దర్శకుడు చెప్పారు. ఒక సందర్భంలో బొమ్మకు ఏకంగా పది అంతస్తుల మేడపైకి చిన్నారి ఎక్కినప్పుడు కనిపించే దృశ్యం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చిన్న పిల్ల అయినప్పటికీ మైరా చాలా చక్కగా నటించింది. కొన్నిసార్లు ఆమె తెలియక చేసిన పనిని కూడా సహజంగా ఇందులో చూపించారు.

రేటింగ్ : 3.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News, Latest Telugu News, telugu news live, Telugu News Headlines, Latest Telugu Breaking News , Political News, Crime News, sports news, Cinema News, Latest Cinema Updates,Telugu Cinema News,Election News,Telangana News, ,Telugu Film News  and Many More.

Read Another : ‘ పీహూ ’ ట్రైలర్ చూస్తే కళ్ళు చేదిరిపోవాల్సిందే..?

You might also like