Saakshyam
Nothing scared but the truth

అజ్ఞానం తో మాట్లాడుతున్న పవన్

Pawan kalyan speaks foolishly

0

Pawan kalyan speaks foolishly | Telugu political news

సినీ అనుభవం తప్ప రాజకీయానుభవం లేని పవన్ కల్యాణ్ కు వాస్తవాలు తెలియడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan kalyan speaks foolishly) ఎలాంటి రాజకీయ ఫ్రస్ట్రేషన్ లో కొట్టుమిట్టాడుతున్నాడో మనకు స్పష్టంగా తెలియదు గానీ.. ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ ను ప్రజలకు చూపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా అనంతపురం జిల్లాలో జరిగిన ఓ సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాగే జగన్ మోహన్ రెడ్ది కూడా జైలుకు వెళ్తారని పవన్ చెబుతున్నారు. దీన్నే రాజకీయ అనుభవం లేమి అంటారని రాజకీయ పండితులు చెబుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా జైలుకు పంపించిందని, ఈ కేసులు ఏవీ న్యాయస్ధానంలో నిలిచేవి కావని పలువురు న్యాయవాదులు కూడా చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ అధికారంలో లేరని, ఆయనపై చంద్రబాబు నాయుడు – కాంగ్రెస్ పార్టీలు కలిసి పన్నిన కుట్రలో భాగంగా జైలుకు వెళ్లారని వారు అంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సిబిఐ మాజీ అధికారులు స్పష్టం చేస్తున్నారని అంటున్నారు.

Pawan kalyan speaks foolishly | Telugu political updates

రాజకీయంగా తానే బలోపేతం కావాలని అనుకున్న తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గపు పాలనను తూర్పార పడుతూ పవన్ కల్యాణ్ తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోడానికి నానాపాట్లు పడుతూ వచ్చారు. అయితే కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా అస్తిత్వం కోరుకుంటున్నప్పుడు పవన్ కల్యాణ్, ప్రత్యర్థుల మీద ఎలాంటి బురద చల్లడానికైనా తెగబడవచ్చు. ఒక రకంగా చూసినప్పుడు జగన్ మీద దాడిని కూడా రాజకీయ అస్తిత్వం కోసం పవన్ ఆరాటంగా అర్థం చేసుకోవచ్చు. రెండు పార్టీలను బద్నాం చేస్తే తప్ప.. తన మొహం ఎవ్వరూ చూడరని పవన్ అనుకుని ఉండొచ్చు. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందే అంటూ ప్రజల్లో భయాన్ని రేకెత్తించడానికి ప్రయత్నించడమూ ఇలాంటిదే.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:చేతులు ముడుచుకున్న మోడీ

You might also like