Saakshyam
Nothing scared but the truth
Page Right

హైపర్ ఆదిని పరామర్శించడానికి పయనమైన పవన్…??

0

Hyper aadi, Pawan kalyan,

అతి తక్కువ సమయంలో ఎక్కువ మైలేజ్ దక్కించుకోవడం అంటే అది చాల కష్టమైన పని, పైగా బుల్లితెరపైన అలాంటి ఇమేజ్ ని దక్కించుకోవడం అంటే ఇంకాస్తా కష్టపడాల్సి ఉంటుంది. కాని జబర్దస్త్ షో వలన బుల్లితెరకి పరిచయమయ్యి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మైలేజ్ ని సొంతం చేసుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం జబర్దస్త్ షో అంత రేటింగ్ తో దూసుకుపోవడానికి గల కారణం ఆది అనే వార్తలు కూడా నేట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే తను ఒకప్పుడు అదిరే అభి టీం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తరువాత సొంతగా తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగాడు, తన స్కిట్ గా తనే సొంతగా స్క్రీప్ట్ రాసుకుంటూ పంచు వర్షం కురిపిస్తూ ప్రేక్షకులకు నవ్వులను అందిస్తున్నాడు. ఇక అతని స్కిట్స్ కి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కడం ఒక అద్భుతం. అతని వలెనే జబర్దస్త్ కి అంత టీఅర్పి రేటింగ్ దక్కుతుంది.

ఇక ఆది సునామి ఒక్క బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా మెరిపిస్తుంది, అతని పంచులు వెండితెరపైన కూడా కురిపిస్తున్నాడు. తన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా నవ్విస్తున్నాడు ఆది, అంతలా పేరు ప్రతిస్థలు సంపాదించుకున్న ఆది గత రెండు మూడు వారాల నుండి జబర్దస్త్ స్టేజ్ పైన కనిపించడం లేదు. అయితే అందరు కూడా ఏదైనా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారేమో అనుకున్నారు. కానీ గత కొద్ది రోజుల నుండి హైపర్ ఆది పై ఒక వార్త నేట్టింట్లో హల్చల్ చేస్తుంది అదేమిటంటే ఆదికి యాక్సిడెంట్ అయినట్లు ప్రస్తుతం అతను కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఆది ఎప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు జపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు తన స్కిట్స్ లో కూడా పవన్ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు అంతకుమించి ఈ మధ్య కాలంలో ఆది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రచారానికి కూడా దిగాడు. ఇక ఆది కి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో పవన్ కళ్యాణ్ తన అభిమానిని పలకరించడానికి హైపర్ ఆదిని(Hyper aadi) ఇంటికి పయనమైనట్లు సమాచారం. ఇక ఈ సమాచారం అందిన వెంటనే ఆ ఊరీ ప్రజలందరూ కూడా అక్కడికి వేల సంఖ్యలో తరలి వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఈ విషయంపై స్వయంగా ఆది నోరు విప్పితే తప్ప తెలియదు..

Click Here : జబర్దస్త్ నుండి బయటకి వచ్చిన హైపర్ ఆది..ఆ పార్టీ కోసమేనా…?

You might also like