Saakshyam
Nothing scared but the truth

పవన్ కళ్యాణ్…మాటల్లో మసాలా తగ్గిందేంటో మరి….?

Pawan Kalyan Silent On Politics || Telugu Political News || Saakshyam

0

Pawan Kalyan Silent On Politics || Breaking News || Saakshyam || Pawan kalyan

నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan Silent On Politics ) నిత్యం మీడియా ముందుకు వచ్చి అభిమానులతో ముచ్చట్లు ముచ్చడించేవారు, ఒకవైపు ప్రతిపక్ష నేత వైసీపీ జగన్ పైన, మరొకవైపు అధికార పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు పైన ఎదో ఒక విమర్శలు చేసుకుంటూ జనాలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఎంతైనా సినిమా హీరో కదా కాస్తా మసాలా మాటలు చెప్పి తన మాటలకూ మరింత పోదును పెట్టి జగన్, బాబు పైన కామెంట్స్ పేలుస్తూ మీడియాలో నానా హంగామా చేసేవాడు. ఇలా ఒక విషయం అని కాదు.. చాలా విషయాలలో పవన్ అలాగే ప్రవర్తించేవాడు ఆఖరికి జగన్ పై కులం వ్యాఖ్యలు చేయడానికి కూడా పవన్ కల్యాణ్ వెనుకాడలేదు! ఎప్పుడు ఏదో ఒక సెన్షేషనల్ కామెంట్ చేసి.. స్పైసీ, మసాలా హెడ్డింగులు పెట్టుకునే యూట్యూబ్ చానల్ తరహా రాజకీయాలు చేస్తూ వచ్చాడు పవన్ కల్యాణ్.

ఇలా ఉండే పవన్ క్రిస్మస్ సెలవలు, న్యూ ఇయర్ వేడుక తరువాత తనలో కుసింత బస్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఏది ఈ మధ్య కాలంలో మీడియాలో గాని సోషల్ మీడియాలో గాని ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పుడు ఆ యాత్ర, అ జిల్లా అంటూ ఎదో ఒక రచ్చ చేసుకుంటూ పర్యాటనలు చేసుకుంటూ తిరిగే పవన్ ఈ మధ్య కాస్తా హడావిడి తగ్గించినట్లు కనిపిస్తుంది. కొత్త సంవత్సరం వచ్చిన తరువాత పవన్ కాస్తా మసాలా మాటల మాట్లాడడం తగ్గించాడు అనే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పవన్ ఎక్కువగా జనాలను ఆకర్షించేలా జనసేన పార్టీ గురించి అలాగే కులాలు, మతాలు గురించి స్పైసీ మాటలు చెప్పుకుంటూ యూత్ లో ఫాల్లోయింగ్ ని పెంచుకోనేవాడు కాని అది ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.

Pawan Kalyan Silent On Politics || Telugu Headlines || Saakshyam || Janasena Party

మరి దీని వెనుక ఎలాంటి అంతరాయం ఉందో తెలియదు కాదు కొత్త సంవత్సరం లో మాత్రం కాస్తా మసాలా తగ్గిందనే తెలుస్తుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మళ్ళి అభిమానుల మందుకు వచ్చాడని తెలుస్తుంది, వాళ్లకు బోధలు చేస్తూ ఉన్నాడు. టికెట్లు ఎవరు ఆశించాలి, ఎవరు ఆశించకూడదు.. అనే అంశాల గురించి పవన్ వివరించి చెబుతూ ఉన్నాడు. ఎన్ని చెప్పిన కాని ఆ మాటల్లో 2018 లో ఉన్నంత మసాలా అయితే కనిపించడం లేదు ఎదో సాదాసీదాగా అభిమానులతో మాట్లాడినట్లు అనిపించింది. ఎంత చేసిన ఏం లాభం లేదని పవన్ కళ్యాణ్ కి అర్ధం అయినట్లు ఉంది అందుకే మసాలా డోస్ తగ్గించాలని భావించాడు అనుకుంట. ఏమో చూద్దాం ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందిగా…ఇంతలోనే తొందరెందుకు మిత్రమా…

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  పవన్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను కానీ జనసేన అంటే కష్టం…?

You might also like