Saakshyam
Nothing scared but the truth

ఇది కచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది : పవన్ కళ్యాణ్

0

Pawan kalyan, Chandrababu, Elections

రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నారో, సీఏం సీట్ అంటే మన ఇంట్లో ఉంటె కుర్చీ అనుకుంటున్నారేమో ఎవరి పడితే వారు ఎప్పటికప్పుడు సీఏం సీట్ నాదే అంటూ రెంకలు వేస్తూ రెచ్చిపోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటికప్పుడు నేనే సీఏం నాదే సీఏం సీట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఆ సీట్ కోసమే తన్నుకు చస్తున్నారు ఇలాంటి సమయంలో పవన్ వచ్చి ఖచ్చితంగా ఆ సీట్ నాదే నాకే వస్తుంది అంటూ ఎక్కడ సభలు ఏర్పాటు చేస్తే అక్కడ గొంతు పెగల్చుకొని పేర్కొంటున్నారు. తాజాగా పవన్ మరొకసారి ఇదే విషయంపై మాట్లాడారు, ధవళేశ్వరం ఏర్పాటు చేసిన కావత్ కి పది లక్షల మంది వచ్చారు నేను వారికోసం బిర్యానీలు, బీరు లు ఇవ్వలేదు అయిన కూడా వారు నాకోసం వచ్చారు నేను వారి ఋణం ఎలా తీర్చుకోవాలి? జనసేన పెట్టి మీకు ఇలా సేవ చేసుకునే భాగ్యం కలిగింది.

అసలు దేవుడు లేని ఊరిలో మంచం కోడే పోతురాజు.. మనకు ఇప్పుడు మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, నెహ్రూలాంటివారెవరూ లేరు.. మనకున్నదల్లా జగన్‌, చంద్రబాబు, లోకేశ్‌లే… జగన్‌ను చూద్దామంటే ఆయన మీద కేసులున్నాయి. బాబు చూస్తే మొత్తం అవినీతి, ఇక లోకేష్ కి ఒక పప్పు అని ముద్ర పడిపోయింది, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. ఇలాంటి సమయంలో మీరందరూ ‘సీఎం పవర్‌స్టార్‌.. సీఎం పవర్‌స్టార్‌..’ అని అరుస్తుంటే.. పవన్‌ స్పందిస్తూ.. ‘సీఎం పవర్‌స్టార్‌ అంటే అదొక మంత్రం. ఇది కచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది. ‘సరికొత్త సమీకరణలవల్ల జనసేన అధికారంలోకి వస్తుంది వచ్చితీరుతుంది. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చే చాన్సులేదు, ఇక జగన్ వైసీపీ భుత్వాన్ని స్థాపించలేరు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్కడ సభలో పవన్ కళ్యాణ్ (Pawan kalyan) లోకేష్, ఏనామాల రామకృష్ణుడు, చినరాజప్ప పై విమర్శలు చేశారు మీరు ఒక్కొక్కరు ఎన్ని పాపాలు చేసారో జనాలకు తెలుసు మీరు చేసిన పాపాలకు చింతకాయల్లాగా రాలిపోతారు. మిమ్మల్ని వెనకేసుకొచ్చిన వాళ్లు దీపావళి టపాసుల్లా రాలిపోతారు అంటూ పేర్కొన్నారు.

‘2014లో చంద్రబాబుకు సపోర్టు చేయడం అప్పటి ధర్మం. 2019లో టీడీపీని రానివ్వకపోవడం ఇప్పటి ధర్మం. అప్పట్లో ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దళితకోసం 470 ఎకరాలు ఇచ్చేశారు కాని ఇప్పుడ లోకేష్, బాబు ఇద్దరు కలిసి అక్రమాలు అన్యాయాలు చేసి ఆ భూముల్లో మట్టి తవ్వేసి వాటిని అమ్ముకుంటున్నారు, ఇలాంటి వాటి గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మాట్లాడరని ఎద్దేవా చేశారు. ‘చినరాజప్ప ఏం చేస్తున్నారు..? కడియం నర్సరీవాళ్లు రెండడుగులు తవ్వుకుంటే మాత్రం కేసులు పెట్టిస్తారు. పచ్చని భూముల్ని లాక్కున్నారు. ఇలాంటి పనులు చేస్తుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? దేవుడు లేడా? ధర్మాన్ని రక్షించడానికే వచ్చా’ అని చెప్పారు. ఇక ఇందులో ఎలాంటి సందేహం లేదు 2019 తో ఆంధ్రప్రదేశ్ లో ఎగిరే జెండా జనసేనానే అని తేల్చి చెప్పేశారు పవన్..

Click here : చంద్రబాబు పై పవన్ సీరియస్

You might also like