Saakshyam
Nothing scared but the truth
Page Right

అసలు నీకు ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా బాబు : పవన్ కళ్యాణ్

0

Chandrababu, Pawan kalyan, Janasena

అసలు ఇలా చెయ్యడానికి కొద్దిగా అయిన ఉండాలి పొద్దున్న లేస్తే చాలు ఆత్మగౌరవం అంటూ ఉంటాడు తన ప్రసంగాలు అన్ని కూడా అదే అత్మగౌరవం పెరుతో ముగిస్తూ ఉంటాడు, మరి ఇప్పుడే ఎక్కడకి పోయింది ఆ ఆత్మగౌరవం? దాన్ని ఎక్కడ వదిలేసి వచ్చావు? ఇప్పుడు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారు. అంటూ భగ్గుమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అసలు ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా బాబు (Chandrababu) అని పవన్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. “కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో అని పిలుపునిచ్చింది నేను. ఉన్నట్టుండి రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ అలాంటి కాంగ్రెస్ ని తెలుగు రాష్ట్రాలలో రాకుండా చేసాను, ఒకప్పుడు ఆ కాంగ్రెస్ లో నా సొంత అన్నయ్య ఉన్నారని అతనిని కూడా కాదనుకున్నాను అంతకుమించి నా కుటుంబాన్ని అంత కూడా దూరంగా పెట్టాను, తెలిసి తెలియకుండా టీడీపీ కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చేలా చేసాను అలాంటిది ఇప్పుడు బాబు అదే కాంగ్రెస్ తో కాపురానికి సిద్దం అయ్యింది, ఢిల్లీ వెళ్లి మరి కాంగ్రెస్ పెద్దలతో షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఫోటోలకు పోజులిచ్చారు, ఇదేనా టీడీపీ ఆత్మగౌరవం అంటూ పవన్ మండిపడ్డారు.

నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ తుని వెళ్లి అక్కడ జరిగిన సభలో బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎప్పుడు కూడా 40 ఏళ్ల అనుభవం ఉంది నన్ను ఎవ్వరు ఏమి చెయ్యలేరు రాజకీయాల్లో నేనే కింగ్ అంటూ డబ్బా చెప్పుకొనే బాబు ఇప్పుడు ఢిల్లీ వెళ్లి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు, ఇదేనా అయన అనుభవం, సంస్కారం అంటూ ఎత్తిపొడిచారు, ఎవరైనా తనకు భయం లేదని, కానీ చంద్రబాబుకు మాత్రం ఏదో ఒక అండ లేకపోతే భయమని విమర్శించారు పవన్. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, మేం బీజేపీ పార్టీ ని వెనకేసుకోస్తున్నాం అని, అరె నేను నా సొంత అన్నయ్యనే కాదనుకున్నాను, నేను ఎవరికీ భయపడను, నాకు వెనుక ఏమైనా వేల కోట్ల అస్తులున్నయా? ఐటీ రైడ్స్ చేస్తారని భయపడడానికి? లేక నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారని లోనిపోవడానికి? లేకపోతే నా దగ్గర హెరిటేజ్ లాంటి సంస్థలున్నాయా?”

.ప్రత్యేకహోదా కావాలంటూ తను ఉద్యమం లేవనెత్తితే, ప్ర్తత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు బీజీపీ నేతలకు చంద్రబాబు మంగళ స్నానాలు చేయించి, సన్మానాలు చేశారని పవన్ విమర్శించారు. జీవితంలో ఎప్పుడు కూడా బీజేపీ టి గాని టీడీపీ తో గాని చేతులు కలపనని జనసేనన్ని విలీనం చెయ్యను అని తెలిపారు. నేను చచ్చిపోతానుగాని ఎప్పుడు ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేయను. ఓటు రాకపోతే పోయే, ఓటమి వస్తే రాని. కానీ తెలుగుదేశం లాగా నేను నా జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టను. జీన్స్ తో తిరిగే నేను ఇప్పుడు కొత్తగా పంచెకట్టు కట్టడానికి కారణం ఇదే. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెబుతాను.” అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏది ఏమియన్ పవన్ రూటే వేరబ్బా..

Click here : చంద్రబాబు పై పవన్ సీరియస్

You might also like