Saakshyam
Nothing scared but the truth
Page Right

పవన్ ఏందీ ఈ గందరగోళం..అసలు నీ నియోజికవర్గానికి దారేది…

Pawan Kalyan Confusion On His Politics | political news | Saakshyam.com

0

Trivikram,Pawan Kalyan,Saakshyam Political  News

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Confusion On His Politics) కి మంచి హిట్ నే ఇచ్చింది కాని అది పొలిటికల్ గా కూడా వర్క్ అవుట్ అవుతుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న గందరగోళం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా అదే గందరగోళం కనిపిస్తుంది. ఆ జిల్లా ఈ జిల్లా అంటూ ఏపీలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తున్నాడు మంచి మైలేజ్ దక్కించుకున్నాడు కాని అసలు ఎక్కడి నుండి ఏ నియోజికవర్గం నుండి పోటి చెయ్యాలో మాత్రం నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఎంత హడావిడి చేసిన కూడా పవన్ కళ్యాణ్ మాత్రం అభ్యర్థులు తగినంత మంది దొరకలేదని… ఆయన పోటీ చేయడానికి అనుకూలమైన నియోజకవర్గం కూడా ఏదీ గుర్తించలేకపోయారని టాక్. ప్రస్తుతం తనకి సొంత జిల్లా అయిన గోదావరి నదని పోటి చెయ్యలా లేక తనకి మంచి మైలేజ్ వస్తున్న ఉత్తరాంద్రలో పోటి చెయ్యలా అన్నది మాత్రం పవన్ని డిఫెన్స్ లో పడేస్తుంది ప్రస్తుతం ఏది కూడా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది.

పవన్ మాటల్లోనూ ఆ అస్పష్టత అనేకసార్లు బయటపడుతోంది. ఒకసారి తిరుపతినిఉంది పోటి చెయ్యమని ఒత్తిడి పెడుతున్నారు అంటాడు, మరొకసారి ఎస్టీ నియోజకవర్గం నుండి అని చెప్పుకొస్తారు, మరోతూలి అనంతపురం నుండి పోటీ చేయబోతున్నట్లు స్వయంగా పవన్ కల్యాణే ప్రకటించారు. ఇప్పుడు పిఠాపురంలో సభ పెట్టి అక్కడినుంచే పోటీ చేస్తానంటున్నారు. అసలు అయన రాజకీయాలపైన ఆయనే స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఇటు చూస్తేనేమో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఒకవైపు నుండి అధికార పార్టీ మరొకవైపు నుండి ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా ఎవరికీ తోచినట్లు వారు మాస్టర్ బ్రెయిన్స్ ఉపయోగించి ప్లాన్స్ రచిస్తున్నారు.

Pawan Kalyan Confusion On His Politics

కాని పవన్ మాత్రం ఇంతవరకు నియోజికవర్గానే డిసైడ్ చెయ్యలేకపోతున్నారు. అసలు పవన్ నియోజికవర్గాన్నే ఎంచుకోవడానికి కిందామీద అవుతున్నారే ఇక మిగతా సీట్లకు అభ్యర్థుల విషయంలో ఇంకెంత పిచ్చెక్కిస్తాడో అని ఆయన పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. అయితే… జనసేనను బచ్చాలా చూస్తున్న మిగతా పార్టీలు మాత్రం పవన్ కళ్యాణ్ కు అభ్యర్థులు అస్సలు లేకపోవడంతో అన్ని స్థానాల నుంచి తానే పోటీ చేయాలునకుంటున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఏంటో ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమి అర్ధం కాకుండా అయిపోతుంది ఇదంతా చూస్తుంటే పవన్ నియోజికవర్గానికి దారేది అని అనిపిస్తుంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : ఇది కచ్చితంగా 2019లో జరిగి తీరుతుంది : పవన్ కళ్యాణ్

You might also like