Saakshyam
Nothing scared but the truth

ఫ్రస్టేషన్ తో రగిలిపోతున్న పవన్…ఆ రాష్ట్రం నాలుగు ముక్కలు కావాలి, ఇది ఆంధ్రుల శాపం..!!

Pawan kalyan comments on Chandrababu | Latest news | Saakshyam

0

Pawan kalyan, Chandrababu, Narendra Modi

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) గత మూడు రోజుల నుండి పోరాట యాత్రని కొనసాగిస్తున్నారు, రైలు ప్రయాణం చేస్తూ జనాలతో దగ్గరుండి వారి సమస్యలను తెలుసుకుంటూ పేస్ బుక్ ద్వారా లైవ్ ని అందిస్తూ ఎప్పటికప్పుడు మన రాష్ట్రము గురించి జనాలకు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటె నిన్న జగ్గంపేట భహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలను చేశారు. నరేంద్రమోడి వెంట మేము నడుస్తున్నాము అంటూ వస్తున్నా వార్తలలో ఎలాంటి నిజం లేదని అతనిని తిట్టుకోనేవారిలో నేను కూడా ఒకరినని తేల్చి చెప్పేశారు, అంతేకాదు నరేంద్రమోడి ప్రభుత్వం పై మరోసారి భగ్గుమన్నారు, ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కావాలి, ఇది ఆంధ్రుల శాపం అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. మనం రాష్ట్రాన్ని విడగోట్టినవారిపై తనకి ఎంతో కోపంగా ఉందని ఆంధ్రుల ఉసురు ఖచ్చితంగా తగులుతుందని అది వారు అనుభవించి తిరుతారని, అంత పెద్ద రాష్ట్రాన్ని చూసుకుని వాళ్లు విర్రవీగుతున్నారు”. అంటూ జగ్గంపేట బహిరంగ సభలో దుమ్మెత్తిపోశారు పవన్.

ఇక అదే భహిరంగ సభలో మరోసారి టీడీపీ పై మండిపడ్డారు పూర్వం మొత్తం కూడా తవ్వుకుంటూ వచ్చారు, 1997లో కాకినాడలో బీజేపీ ఒక ఓటు, రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేసిందని, అప్పుడే వాళ్లని నిలదీసి ఉండాల్సిందని అంటున్నాడు పవన్. అయితే దానికి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏం చేశారు, పోనీ అప్పట్లో అతను రాజకీయాల్లో లేరనుకోండి, వచ్చిన తరువాత అయిన నిలదీయాల్సింది కదా, కనీసం దూరంపెట్టాల్సిన నైతిక బాధ్యత పవన్ పై ఉంది కదా అంటూ కమెంట్స్ వస్తున్నాయి. ఎప్పుడో 1997 రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు అంటే పవన్ కి కూడా రాజకీయం బాగానే అబ్బినట్లు తెలుస్తుంది. ఏది ఎలా జరిగిన ఎంత జరిగిన కూడా కింగ్, కింగ్ మేకర్ అనే పదాన్ని మాత్రం వదలరు, ఒకరోజు ఏమో నేను కింగ్ మేకర్ అంటారు మరోరోజు నేనే కింగ్ అంటారు ఇక అలవాటులో పొరపాటు నిన్న సభలో కూడా ఈ కింగ్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఎప్పటికైనా తనే ఆంధ్రప్రదేశ్ కింగ్ అని జనాలకు నచ్చజెప్పే పనిలో పడ్డారు.

అంతటితో ఆగరా అంటే అబ్బే అదేమిలేదు మరో అడుగు ముందుకు వేసి రాబోయేది జనసేన రాజ్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసేది జనసేన పార్టీ అన్నారు.అయితే పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న వచ్చారు రాజకీయాల్లోకి కాని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎప్పటినుండి రాజకీయాల్లో ఉన్నారో అందరికి తెలిసిన విషయమే మరి ఆ రెండు పార్టీలను కాదని జనాలు జనసేన కి ఓటు వేస్తారా? ఈ పార్టీకి అసలు అభ్యర్థులు ఉన్నారా లేరా, కనీసం గుర్తు కూడా తెచ్చుకోలేని గుర్తింపు లేని పార్టీగా మిగిలిపోయిన జనసేన ఎలా అధికారంలోకి వస్తుంది, పవన్ ఎలా సీఎం అవుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ పవన్ మాత్రం సినిమా డైయలగ్స్ వాడి జనాలను మైమరపించే పనిలో ఉన్నారు కాని అది రాజకీయం ఎంతమాత్రం వర్క్ అవుట్ అవుతుందో తెలియదు. చూద్దాం ఏం జరుగుతుందో…

Click here : సిగ్గుందా మాట అనడానికి బాబు పై కేసీఆర్…?

You might also like