Saakshyam
Nothing scared but the truth

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన చంద్రబాబు – పవన్ కళ్యాణ్

0

Pawan kalyan, Chandrababu, TDP, Twitter

ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులను ట్విట్టర్ ద్వారా ఎండగట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan)మరోసారి ఆయనపై ధ్వజమెత్తారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కదా అని గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నాడని  అభివృద్ధిలో మూడు దశాబ్దాలు వెనక్కి నెత్తిన ఘనత బాబుదేనన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన పక్కకు తప్పుకుని యువతరానికి అవకాశం ఇవ్వాలన్నారు.

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని టిడిపి నాయకులు హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారని కానీ ఆయన మళ్ళీ అధికారంలోకి ఆస్తే అవినీతి రాజ్యమేలుతుందన్నారు. ఏపీని దెబ్బతీసి ఎంపిలను కొట్టిన కాంగ్రెస్ తో జతకట్టి రాహుల్ గాంధీకి పాదాభివందనం చేయడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ వెళ్లి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టిన మహానుభావుడు చంద్రబాబు అని మండిపడ్డారు. వంతాడలో అన్నీ అక్రమాలే చోటుచేసుకుంటున్నాయని, చంద్రబాబు హయాంలో మైనింగ్ దోపిడీ రెట్టింపు అయిందని ఆరోపించారు.

Click here : ఈ గెటప్ ఏంటీ పవన్..? దేనికోసం ఇదంత..?

You might also like