Saakshyam
Nothing scared but the truth
Page Right

ఇది నిజమేనా.. బిజెపి తెలంగాణ సీఎం అభ్యర్థిగా పరిపూర్ణానంద

0

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా అమ్మవారి దయ ఉంటె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతానని పరిపూర్ణానంద (Paripoomanada) స్వామి పేర్కొన్నారు. అయితే ఏ పార్టీ ముందు తనని ఆహ్వానిస్తుందో ఆ పార్టీలో చేరుతానని పేర్కొన్నారు. దీంతో బిజెపి పార్టీ నుండి ఆయనకు పిలుపు వచ్చింది. అత్యవసరంగా హస్తినకు రమ్మని బిజెపి అధిష్టానం ఆయనకు సూచించినట్లు తెలిసింది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో తెలంగాణ బిజెపి నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్నే నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కనీసం ఎంపీగానైనా బిజెపి నుండి పోటీ చేయించాలనే భావనలో అధిష్టానం ఉందట. మరి ఈ సందిగ్దతపై పరిపూర్ణానంద ఎలాంటి స్పష్టత ఇస్తారో తానూ ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ని సీఎం అభ్యర్థిగా ఎంచుకున్న బిజెపి అక్కడ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని ఆయనకు కట్టబెట్టారు. అదే కోణంలో తెలంగాణలో పరిపూర్ణానంద స్వామిని సైతం ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

You might also like