Saakshyam
Nothing scared but the truth

ఇది విన్నారా…టీఆర్ఎస్ గెలుపుకోసం లగడపాటి భార్య ప్రచారం…

0

ఒకవైపు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా లగడపాటి సర్వే జరుపుతున్నారు అంటూ తెలంగాణా మంత్రి కేటీఅర్ రెండు చిలకలు పంపిస్తా చిలక జోస్యం చెప్పుకోమను అంటూ మండిపడుతుంటే మరొకవైపు లగడపాటి భార్య మాత్రం తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీ గేలుపు కోసం ప్రచారానికి దిగుతున్నట్లు తెలుస్తుంది. ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌ డివిజన్‌లో ప్రచారం చేశారు. ‘దానం నాగేందర్‌ అన్నను గెలిపించాలి’ ఆమె కోరారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ఐదేల్లలో ఇంత అభివృద్ధి చెయ్యలేదని ఒక్క కేసీఆర్ మాత్రమే తెలంగాణా కోసం ఇంత కష్టపడ్డారు అని ఆమె తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా ఆరు గుర్తుకి ఓటు వేసి నాగేందర్ గెలిపించాలని లగడపాటి భార్య కోరారు. మొన్నటికి మొన్న లగడపాటి రాజగోపాల్ వదిలిన సర్వే టీఆర్ఎస్ పార్టీ కి వణుకు పుట్టించింది దానిపైన కేటీఆర్ స్పందించి ఈ సర్వే రిజల్ట్ వెనుక చంద్రబాబు హస్తం ఉందని చంద్రబాబు ఒత్తిడి వలెనే లగడపాటి ఇలాంటి తప్పుడు సర్వే విడుదల చేసారని కేటీఅర్ ప్రకటించారు.

దీనిపై నిన్న లగడపాటి ప్రెస్ మీట్ పెట్టగా, దానికి బదులుగా కేటీఆర్ ట్విట్టర్లో ఖండించారు. ఈ సర్వే పై ఒక్క కేటీఅరే కాదు మరో మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. నిన్నటి రోజున సిద్దిపేటలో నిర్వహించిన రోడ్ షో లో హరీష్ రావు లగడపాటి సర్వే పై మండిపడ్డారు, టీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన దొంగ బట్టేబాజ్‌ లగడపాటి రాజ్‌గోపాల్‌ అని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తెలంగాణను చంద్రబాబు తిరిగి ఆంధ్రాలో కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని.. చంద్రబాబు ఏజెంటుగా మారిన లగడపాటి అబద్దపు సర్వేలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇలా అతనిపై వారు విమర్శలు చేస్తుంటే అతని భార్య మాత్రం ప్రచారానికి దిగ్త్రున్నారు. ఈ రాజకీయాలు ఏంటో ఏమి అర్ధం కావడం లేదు..

You might also like