Saakshyam
Nothing scared but the truth
Page Right

మార్కెట్ లో హల్చల్ చేస్తున్న ఒప్పో ‘ఆర్17 నియో’ ఫోన్…!!

0

Oppo R17 Neo, Specifications, Features

ప్రపంచంలో స్మార్ట్ ఫోన్స్ హవా ఎలా కొనసాగుతుందంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు, ఎక్కడ చూసిన ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ హల్చల్ చేస్తూనే ఉంది, ప్రముఖ టెలికం కంపెనీస్ ఒకదానికి మించి కొత్త కొత్త మోడల్స్ లో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి మొబైల్స్ ని వదులుతున్నారు. అది కూడా తక్కువ ధరకి ఎక్కువ ఫీచర్స్ ఉండేలా తాయారు చేస్తున్నారు. ఇక అలాంటి ఆఫర్ ని ఎవరైనా వదులుకుంటారా అది జరగని పని అందుకే ఈరోజు కొన్న మొబైల్ రేపటికి పాతది అయిపోతుంది మార్కెట్ లోకి ఏది కొత్తది వస్తే దానిపైన మనసు పారేసుకుంటున్నారు జనాలు. తాజాగా మార్కెట్ లోకి ఒప్పో నుండి మరో కొత్త ఫోన్ బయటకి వచ్చింది. ఇప్పటికి ఒప్పో నుండి చాలారకాలుగా మొబైల్స్ విడుదల అయ్యాయి మంచి రేటింగ్ ని సొంతం చేసుకున్నారు. ఇకా ఆ ఫోన్ లో గొప్పగా చెప్పుకోవాలి అంటే కెమెరా గురించి చెప్పుకోవాలి. జనాలకు కావాల్సిందే కెమెరా ఇక ఆ కెమెరా ఒప్పో లో స్పెషల్ అవ్వడం గొప్ప. తాజాగా (Oppo R17 Neo)‘ఆర్17 నియో’ పేరిట స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,500 లుగా నిర్ణయించింది. ఇక ఈ ఫోన్ మొక్క ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

ఒప్పో ఆర్17 నియో ఫీచర్లు ..

* 6.4 అంగుళాల డిస్‌ప్లే
* 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
* 16 + 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 3600 ఎంఏహెచ్ బ్యాటరీ

Click here : వన్ ప్లస్ 6T యూజర్స్ ని అల్లాడిస్తున్న ఫీచర్స్…!!

You might also like