Saakshyam
Nothing scared but the truth
Page Right

ఫాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త అంటే ఇది మరి…!!

0

NTR, Rajamouli, Multi starer movie

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అది విడుదలకు మరి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఇంతలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇద్దరు కూడా ప్రమోషన్స్ లో మునిగిపోయారు చానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ ఫాన్స్ కి పూనకాలు తెప్పిచేస్తున్నారు. ఫాన్స్ అయితే అరవింద సమేత కోసం పడిగాపులు కాస్తున్నారు టికెట్స్ బుక్ చేసుకొని స్పెషల్ షోస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు షోస్ ని పెంచి టికెట్ ధర కూడా పెంచే పనిలో పడ్డారు. ఇది ఇలా ఉంటె ఫాన్స్ మాత్రం రాజమౌళి (rajamouli) చెయ్యబోతున్న మల్టీ స్టారర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వస్తుంది ప్రకటన చేశారు కాని ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు దాంతో ఫాన్స్ నిరాశా చెందుతున్నారు. పైగా ఎన్టీఆర్ తండ్రి మరణించడంతో ఈ సినిమా మరింత వెనక్కి వెళ్తుందని వార్తలు వస్తున్నాయి, తండ్రి మరణించిన కూడా ఎన్టీఆర్ ఫాన్స్ ఇచ్చిన మాటకోసం తిరిగి నాల్గోవ రోజే షూటింగ్ లో పాల్గొన్నారు ఎట్టకేలకు సినిమా పూర్తీ చేసేసారు.

ఇక ఇప్పుడు మిగిలి ఉంది RRR మాత్రమే ఈ సినిమాపై కూడా ఎన్టీఆర్ తాజాగా ఇక క్లూ ఇచ్చేశారు. అదేమిటంటే నవంబర్ లో స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా తండ్రి మరణం కారణంగా ఒక నెల లేట్ గా వస్తుందని కాని రావడం పకా అని క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్ లో RRR సెట్స్ పైకి వస్తుందని ఫాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త చెప్పారు ఎన్టీఆర్…తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ క్లూ ఇచ్చేశారు అంతేకాకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. త్రివిక్రమ్ తో ఎప్పటినుండో సినిమా చెయ్యాలి అని అనుకున్నాను అది ఇప్పటికి సాధ్యం అయ్యింది, త్రివిక్రమ్ కలలో తానో భాగం అయ్యానే తప్ప సినిమాకు అన్ని త్రివిక్రమే అంటున్నాడు ఎన్.టి.ఆర్.

ఇక అజ్ఞాతవాసి ఫ్లాప్ తాలుఖా చాయలేవి ఈ సినిమా మీద పడలేదని క్లారిటీ ఇచ్చాడు. దర్శకుడు, హీరోలకు హిట్లు, ఫ్లాపులు సహజం. ఫ్లాప్ ఇచ్చాడని తక్కువ చూడలేం. నిజానికి చెప్పుకోవాలి అంటే త్రివిక్రమ్ ఒక అద్భుతమైన రైటర్ అతని డైయలాగ్స్ మాములుగా ఉండవు అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తప్పకుండ త్రివిక్రమ్ కి విజయం అందిస్తుందని భావిస్తున్నాను అంటూ ఒకవైపు అరవింద సమేత గురించి మరోవైపు రాజమౌళి RRR గురించి క్లారిటీ ఇచ్చేశారు ఎన్టీఆర్…

You might also like