Saakshyam
Nothing scared but the truth

‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ రివ్యూ అండ్ రేటింగ్…!!

NTR Kadhanayakudu Movie Review And Rating

0

NTR Kadhanayakudu Movie Review And Rating || Telugu Film News || Saakshyam

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, తమన్నా, హన్సిక, షాలిని పాండే, నిత్యా మీనన్, మంజిమా మోహన్, పూనమ్ బాజ్వా, సుమంత్ తదితరులు ( NTR Kadhanayakudu Movie Review And Rating )
మ్యూజిక్ – ఎం ఎం కీరవాణి
మాటలు – బుర్రా సాయి మాధవ్,
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
బ్యానర్స్: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

 

 నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు. నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ సినిమా ఇది.. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు.. ఎన్టీఆర్ సిరీస్ లో తొలిభాగమైన ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ గురించి ఎన్నో తెలియని విషయాలు తెరపై ఆవిష్కృతం చేశారనే టాక్ ముందునుంచే ఉంది. మరి ఏ మేరకు ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయం తెలీయాలంటే ఈ మూవీ సమీక్ష చదవాల్సిందే..

క‌థ‌:

 

1984 బ్యాక్‌డ్రాప్‌లో చెన్నై అడ‌యార్ క్యాన్సర్ హాస్పిట‌ల్‌లో బ‌స‌వ తార‌క‌మ్మ‌(విద్యాబాల‌న్) చికిత్స తీసుకుంటూ ఉంటుంది. ఆమెను క‌ల‌వ‌డానికి అక్కడికి ఆమె కొడుకు హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్ రామ్‌) వ‌స్తాడు. ఆమె య‌న్‌.టి.ఆర్ ఆల్బమ్ చూడ‌టంతో సినిమా స్టార్ట్ అవుతుంది. నంద‌మూరి తార‌క రామారావు(బాల‌కృష్ణ‌) రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటాడు. అక్కడ లంచాలు తీసుకుని ప్రజ‌ల‌కు సేవ చేయ‌డాన్ని స‌హించ‌లేక మానేసి సినిమాల్లోకి వెళ్లాల‌ని నిర్ణయించుకుంటాడు. మ‌ద్రాస్ చేరుకుని ఎల్‌.వి.ప్రసాద్‌గారిని క‌లుస్తాడు. అక్కడి నుంచి ఆయ‌న జీవితంలో సినిమా ఓ భాగంగా ఎలా మారింది. న‌టుడి నుంచి అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగే క్రమంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్లు ఏంటి? ఆయ‌న‌కు చేసిన పాత్రలు, ఆయ‌న ప్రయాణం.. ఇత‌రుల‌తో ఆయ‌న మెలిగే తీరు.. సినిమాల‌పై ఆయ‌న‌కున్న క‌మిట్‌మెంట్.. సాధార‌ణంగా ఎన్టీఆర్ సినిమాల గురించి తెలుసు.. రాజ‌కీయంగా కూడా ఆయ‌నేంటో తెలుసు. మ‌రి ఆయ‌న‌కు తెలియ‌ని దాన్ని ఈ సినిమాలో ఏమైనా చూపించారా? అంటే అవ‌న్నీ సినిమాలో చూడాల్సిందే..

 

ప్లస్ పాయింట్స్ :

* నటినటులు
* సెకండ్ హాఫ్
* మ్యూజిక్

 

నెగటివ్ పాయింట్స్:

* ఫస్ట్ హాఫ్
* నిడివి ఎక్కువగా ఉండడం
* కొన్ని పాత్రలో బాలయ్య గెటప్

 

విశ్లేషణ:

‘యన్.టి.ఆర్’లో సగటు ప్రేక్షకులు ఆశించే హై పాయింట్స్ పెద్దగా లేవు. ముఖ్యంగా ప్రథమార్ధంలో మలుపులు.. కొత్త విషయాలేమీ లేకపోవడం.. కథ మరీ ఫ్లాట్ గా సాగిపోవడం వల్ల ప్రేక్షకులకు ఒక దశ దాటాక బోర్ కొడుతుంది. సినీ రంగంలో ఎన్టీఆర్ ముద్ర గురించి చూపించే రెండు మూడు ఎలివేషన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. అందులో ఒకటి ‘మాయా బజార్’ సినిమా కోసం తొలిసారి కృష్ణుడి పాత్రలోకి ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేయడం. ఈ సన్నివేశంలో క్రిష్ బలమైన ముద్ర వేశాడు. ఈ సన్నివేశానికి రాసిన లీడ్.. చిత్రీకరణ.. బ్యాగ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా గొప్పగా కుదిరి ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలుగుతుంది. అలాగే ‘సీతా రామ కళ్యాణం’ సినిమాతో దర్శకత్వం చేపట్టిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం పడ్డ కష్టం.. ఆపై ‘దాన వీర శూర కర్ణ’ కోసం చేసిన సాహసం.. వీటికి సంబంధించిన ఎపిసోడ్లను బాగా చిత్రించారు. ఇంతకుమించి సినిమాలో హై పాయింట్స్ కనిపించవు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ మరణానికి సంబంధించిన ఎమోషనల్ సీన్ కొంచెం కదిలిస్తుంది. ప్రథమార్ధం వరకు అయితే కృష్ణుడి సీన్.. కొడుకు మరణానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి. యుక్త వయసులో ఉన్న బాలయ్య సెట్టవ్వకపోవడం వల్ల ప్రథమార్ధంలో చాలా సీన్లు అంత ప్రభావవంతంగా అనిపించవు.

 

ముఖ్యంగా రాజకీయ ప్రవేశానికి కారణమైన పరిస్థితులు, సంఘటనలని చాలా డీటెయిల్డ్‌గా చూపించడం, ఇక్కడ ఎలివేషన్స్‌కి తావు లేకపోవడంతో పతాక సన్నివేశాలు బాగా డల్‌ అయిపోయాయి. రెండో భాగానికి వెళ్లే ముందు తీసుకున్న విరామానికి అవసరమైన ‘బ్రేక్‌’, ఈ సినిమా ఎండ్‌ చేయడానికి కావాల్సిన ‘హై’ మిస్‌ అవడం వల్ల అసంతృప్తితో, సగం కథ చూసిన ఫీలింగ్‌తో బయటకి రావాల్సి వస్తుంది. కథ పరంగా ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు కానీ.. ఉన్నంతలో ఈ కథను క్రిష్ అండ్ టీం ఎంగేజ్ చేసే లాగే చెప్పగలిగింది. ‘ఎన్టీఆర్’ సినిమాను కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు పార్టులు కాకుండా ఒకే పార్టుగా తీసి ఉంటె సినిమా పై కొంచం ప్రభావం చూపించే అవకాశం ఉండేది.

 

సాక్ష్యం రేటింగ్: 2.0/5

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another :  ఎన్టీఆర్ కధానాయకుడు’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

You might also like