Saakshyam
Nothing scared but the truth
Page Right

నోటా రివ్యూ అండ్ రేటింగ్…!!

0

నటీనటులు : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మెహ్రీన్, సంచనా నటరాజన్ సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదిత‌రులు
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా
సంగీతం : సి యస్ సామ్
సినిమాటోగ్రఫర్ : యస్ కృష్ణ రవిచంద్రన్

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

క‌థ‌:
ఓ కేసు కార‌ణంగా వాసుదేవరావ్‌(నాజ‌ర్‌) సిబిఐ కేసుని ఎదుర్కొవ‌డానికి త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. త‌న స్థానంలో త‌న కొడుకు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ని సీఎంని చేస్తాడు. రెండు వారాల్లో వాసుదేవ రావ్‌కి బెయిల్ దొరుకుతుంద‌ని అనుకుంటారు. కానీ సిబిఐ కేసు కార‌ణంగా జైలు కెళ్తాడు వాసుదేవ‌రావ్‌. ముందు సీఎం ప‌ద‌విని బాధ్య‌త‌గా ప‌ట్ట‌ని వ‌రుణ్ త‌ర్వాత సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ప్రారంభిస్తాడు.వ‌రుణ్‌కి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర (స‌త్య‌రాజ్‌) నుండి స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మంచి పేరు సంపాదించుకుంటాడు. అదే స‌మ‌యంలో బెయిల్‌పై విడుద‌లైన వాసుదేవరావ్‌ని చంపే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌రిగిన బాంబు దాడి కార‌ణంగా… అత‌ను కోమాలోకి వెళ్తాడు. అస‌లు త‌న తండ్రిని ఎవ‌రు చంపాల‌నుకున్నార‌నే విష‌యాల‌ను క‌నుక్కోవ‌డానికి వ‌రుణ్ ప్ర‌య‌త్నిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో.. వ‌రుణ్‌కి బ్లాక్‌మ‌నీకి సంబంధించిన చాలా విష‌యాలు తెలుస్తాయి. అప్పుడు వ‌రుణ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాడు? ముఖ్య‌మంత్రిగా వ‌రుణ్ ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు? వాటికి ఎలాంటి ప‌రిష్క‌రాలు క‌నుక్కుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్ :

* విజయ్ దేవరకొండ నటన
* మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌
* ఏమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

* స్లో నారేషన్
* కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ కావ‌డం
* పాటలు

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకొని, ఆ రాజకీయాల్లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను చక్కగా చూపించే ప్రయత్నం చేసినా.. అయన సినిమాని ఆసక్తి కరంగా మలచలేకపోయారు. సి యస్ సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోలేదు. యస్.కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా మంచి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది కానీ అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

సాక్ష్యం రేటింగ్ 2.5/5

You might also like