Saakshyam
Nothing scared but the truth

‘నోటా’ ప్రచారంతో ఆందోళనలో టిఆర్ఎస్

0

TRS, Nota, Karimnagar, Elections

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజు రోజుకి తీవ్ర ఉత్కంఠత రేకెత్తుతుంది. అధికార టిఆర్ఎస్ పార్టీ తన ప్రచారాన్ని విస్తృతం చేయగా ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎలాగైనా తెరాసాను గద్దె దించాలని మహాకూటమి పావులు కడుపుతుండగా మరికొన్ని సంఘటనలు టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. గత నాలుగేళ్లుగా తమని పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్లు అడుక్కోవడానికి వచ్చారంటూ తాజా మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల పై ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇందుకు ఖానాపూర్ నియోజకవర్గం ఉదాహరణగా చెప్పవచ్చు. పలుచోట్ల అధికార పార్టీ అభ్యర్థులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రానికే అత్యంత ప్రతిష్టాత్మకమైన కరీంగర్ జిల్లాలో ‘నోటా’ ప్రచారం ఇప్పుడు అధికార టిఆర్ఎస్ పార్టీని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ‘నోటా'(Nota) వల్ల అక్కడ పార్టీకి జరిగే నష్టం ఏంటిదో తెలుసా…?

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల్లో నోటా ( నొనె అఫ్ ది అబొవె) పై 1600 లకు పైగా ఓట్లు నమోదు కాగా, ఈసారి అక్కడి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గత నాలుగేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నట్లు అందుకనే ఈసారి ‘నోటా'(Nota) ని వినియోగించుకోవాలని ఆలోచనలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక దీని వెనుక కొందరు ప్రముఖులు పావులు కడుపుతున్నారట. సాధారణంగా వివిధ పార్టీల నేతలు తమ పార్టీనే గెలిపించాలని ప్రచారం చేస్తారు కానీ ఇందుకు భిన్నంగా ‘నోటా’ ని గెలిపించాలని జరుగుతున్నా ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది.  ముఖ్యంగా చాలా మంది యువత ‘ఈసారి నోటాను గెలిపిద్దాం’ అంటూ మద్దతు తెలుపుతున్నారని  తెలిసింది. మరి ఈ నోటా ఎవరి కొంపముంచుతుందో చూద్దాం..

You might also like