Saakshyam
Nothing scared but the truth

తెలంగాణా ప్రజలారా, మళ్లీ మళ్లీ చంద్ర(బాబు)గ్రహణం కావాలా? ఆలోచించి ఓటెయ్యండి

No Need Of Evil Chandrababu For Telangana Again || Election News || Saakshyam

0

No Need Of Evil Chandrababu For Telangana Again || Telugu Political News || Saakshyam

గత రెండు నెలలుగా మీరు వేయబోయే ఓటు కోసం ఎన్ని కోట్లు అక్రమంగా మీ రాష్ట్రానికి వచ్చాయి?  (No Need Of Evil Chandrababu For Telangana Again ) ఎన్నికలప్పుడు డబ్బు ఇచ్చినవాళ్లు మళ్లీ మీ రాష్ట్రం నుండి ముక్కుపిండి మరీ దోచుకొనిపోతారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఆత్మ గౌరవమా? అనంత మైన మోసాలకు మళ్లీ మళ్లీ బాధితులు అవ్వడమా?

తెలంగాణా ఎన్నికల్లో చక్రం తిప్పింది చంద్రబాబే నని తన మీడియా లో పెద్ద గా వేయించుకున్నారు. తెలుగు కూడా రాని చుండ్రు సుహాసిని గారికి కీలక మంత్రి పదవి అంట. పొరపాటున ఏ హోమ్ శాఖో లేదా వ్యవసాయ శాఖో ఇచ్చారంటే మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకెంతమంది రౌడీ నాయకులు మీ రాష్ట్రంలో కి చొరబడుతారో దోచుకోవడానికి.

ఈరోజు చంద్రబాబు మీడియా సమక్షంలో చెప్పారు. ఆంధ్ర లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలి అని. గత నాలుగున్నర సంవత్సరాల్లో చిన్నపాటి వర్షానికి తడిసిపోయే తాత్కాలిక సచివాలయం తప్పితే ఏమి గాని జరగలేదని మీ అందరికీ తెల్సిందే. మహాకూటమి కి ఓటేస్తే రాహు(ల్ ) గ్రహణం, చంద్ర(బాబు)గ్రహణం ప్రతి రోజూ తెలంగాణాలో ఉండి  రాష్ట్రం చీకటిపాలై పోతుంది. ఈ కూటమి లో విషపూరితమైన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు తప్పా మరేమి లేవు. పొరపాటున మీరు వారివైపు ఓటేశారో అంతే. ప్రజలంతా వారి దోపిడీ కి బాధితులవుతారు.

No Need Of Evil Chandrababu For Telangana Again || Telangana News || Saakshyam

అందునా అమలుకాని హామీలిచ్చేసి ఎలాగోలా అధికారం లోకి రావాలన్నదే చంద్రబాబు కుయుక్తి. గత రెండు పర్యాయాలు మీరే చూశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు చూస్తున్నారు. మరో  కొన్ని నెలల్లో జరిగే ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఓటమి ఖాయం. అందుకే తెలంగాణా లో  పాగా వేయాలని ప్రయత్నిస్తున్నాడు. చూశారా,  ఎన్నెన్ని  కోట్లు  అక్రమంగా ఆ కూటమి నాయకుల ఇళ్లలో దొరికాయో ?ఆ డబ్బంతా ఊరికే వచ్చింది కాదు. ఆంధ్ర లో రైతు ల పొట్టకొట్టి దోచుకొన్న డబ్బు. మరి అలాంటి అక్రమ డబ్బుకు ఆశపడి జిత్తులమారి మాటలు నమ్మి మోసపోకండి.

మీ ప్రస్తుత ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూడండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వండి. కూటమి లో గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు? కానీ ఎవరు ప్రభుత్వాన్ని  వెనకనుండి నడిపిస్తారో మీకు తెలుసు. వాళ్ళు అనుకున్నది రాకుంటే ఎంతకైనా తెగిస్తారు. అందుకే ఈ మాయాకూటమిని నమ్మకండి. ఆత్మ సాక్షిగా మీ రాష్ట్రానికి అర్హుడైన నాయకున్ని ఎన్నుకోండి. దుష్టశక్తులను తరిమి కొట్టండి. మళ్ళీ మళ్ళీ భవిష్యత్ లో తెలంగాణ వైపు కన్నెత్తి చూడకూడదు. మాయల మారి చంద్రబాబు కి సగటు తెలంగాణా ఓటరు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించండి.

కథనం మరియు విశ్లేషకులు:

సహదేవ బోడె గారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Read Another : ఏంటీ రామోజీ టీఅర్పి కోసం మరి ఇంత దిగజారిపోవాలా…?

You might also like