Saakshyam
Nothing scared but the truth

అప్పుడు ఉదయ్ కిరణ్ కి ఎలా జరిగిందో ఇప్పుడు విజయ్ దేవరకొండకి కూడా అంతే…?

0
Vijay Devarakonda,Nikhil,Uday Kiran,Geetha Govindam,Naga sourya,Arjun Reddy,NOTA,Sarvanand
ఒక్క హిట్ వస్తే చాలు ఇండస్ట్రీ లో ఆ హీరో రేంజ్ అమాంతం పెరిగిపోతుంది, దానికితోడు ఫాల్లోయింగ్ ఏర్పడుతుంది, ఆఫర్స్ కూడా అదే విధంగా వచ్చిపడిపోతాయి, ఏ విధంగా అయితే ఫాల్లోయింగ్ వచ్చిందో అదే రేంజ్ లో ఈర్ష్య పడేవాళ్ళు కూడా ఉంటారు, అసలేంటి రా బాబు విడి క్రేజ్ అని కారాలు మిరియాలు నురేవాళ్ళు కూడా తయారౌతారు, ఒక్క హిట్ చాలు జీవితాన్నే మార్చేయ్యడానికి ఇప్పుడు ఇదంతా మాట్లాడుకోవడానికి కారణం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అన్నమాట, ఎందుకంటే ఇతనికి ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ లాంటి వారు ఎవ్వరు లేరు కాని అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంటనే వచ్చిన గీతాగోవిందం సినిమాతో అబ్బాయి గారి రేంజ్ 100 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయింది, చిరంజీవి లాంటి హీరో “స్టార్ హీరోల క్లబ్ లోకి స్వాగతం” అంటూ నిండుసభలో ప్రకటించాడంటే విజయ్ దేవరకొండ హవా అర్థంచేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా నాణేనికి ఒకవైపే అని చెప్పుకొవాలి, ఎందుకంటే తనకంటే వెనుక వచ్చిన హీరోల కన్నా అతి తక్కువ సమయంలో ఎక్కువ మైలేజ్ దక్కించుకుంటే మిగిలిన వారిలో ఆటోమ్యటిక్ గా ఈర్ష్య మొదలోతుంది ఇప్పుడు విజయ్ విషయంలో కూడా అదే జరుగుతుంది.
చాలామంది హీరోస్ విజయ పై నెగటివ్ గా కామెంట్స్ వెయ్యడం మొదలు పెడుతున్నారు, నోటా విడుదలయిన ఒక్కరోజుకే బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించకుండా పోయింది, అయితే దానికి విజయ్ ఏమాత్రం మారలేదు తన యాటిట్యూడ్ మాత్రం మారలేదు. సినిమా ఫ్లాప్ అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మరింత కష్టపడతానని ప్రకటించాడు. అయితే ఈ విషయంపై వ్యతిరేకత కూడా మొదలయ్యింది, అతడికి ఫ్లాప్ వస్తే ఇండస్ట్రీలో పండగ చేసుకునే బ్యాచ్ తయారైంది. నోటా రిలీజ్ తరువాత విజయ్ యాటిట్యూడ్ పై హీరో నిఖిల్ పరోక్షంగా ట్విట్ చేసాడు, ప్రపంచం తమ చుట్టూనే ఉందనే భ్రమలు వద్దని, యాటిట్యూడ్ తగ్గించుకుంటే మంచిదని పోస్ట్ చేశాడు. ఇతను ఒక్కడే కాదు మొన్నటికి మొన్న నాగశౌర్య, ఆఫ్ రికార్డ్ హీరో శర్వానంద్ వీరు కూడా విజయ్ పై పరోక్షంగా కామెంట్స్ వేశారు, విజయ్ దేవరకొండ కొన్ని పాత్రలకే పరిమితం అంటూ మాట్లాడాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఒక్కటే కారణం విజయ్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా హిట్స్ కొట్టడం మిగిలిన హీరోస్ కి నచ్చడం లేదు దాంతో ఇలా రియాక్ట్ అవుతున్నారు విజయ్ ని పాతాళానికి తోక్కేయ్యాలి అని భావిస్తున్నారు, గతంలో ఉదయ్ కిరణ్ విషయంలో ఇదే జరిగింది. ఉవ్వెత్తు కెరటంలా దూసుకొచ్చాడు ఉదయ్ కిరణ్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అప్పటి హీరోల్ని ఉక్కిరిబిక్కిరి చేశాడు.
అసలు యూత్ మొత్తం కూడా అతని వెంటే పరుగులు పెట్టింది, ఇక అది అంత చూసి కొంతమంది తెరవెనుక రాజకీయాలు మొదలు పెట్టారు దెబ్బతో ఉదయ్ కి కొల్కోలేని షాక్ ఇచ్చారు, ఇక ఆకక్డితో ఉదయ్ కెరీర్ కి పుల్ స్టాప్ పడిపోయింది. అతని జీవితమే సర్వ నాశనం అయిపొయింది ఇక ఇప్పుడు అదే తరహాలో విజయ్  విషయంలో జరుగుతుంది, చేసింది కొద్దిగా సినిమాలే అయిన కూడా మంచి హిట్స్, ఫాల్లోయింగ్ చూసి తట్టుకోలేకపోతున్నారు అతని సక్సస్ ని తోక్కేయ్యాలి అని చూస్తున్నారు. కానీ విజయ్ కి అభిమానులు ఉన్నారు అలాగే ఇండస్ట్రీ లో శత్రువులున్నారు. పైకి నవ్వుతారు. నేను నీవాడినే అన్నట్టు మాట్లాడారు. కానీ ఊహించని లోతులో గోతులు తవ్వుతారు. ఇప్పటికే చాలామంది విజయ్ పై ఓపెన్ అయ్యారు, తమ ఫీలింగ్స్ ని బయటపేట్టేసారు ఇకపై విజయ్ కాస్తా జాగ్రత్త గా ఉంటె బాగుంటుంది.
You might also like