Saakshyam
Nothing scared but the truth
Page Right

ది మాస్టర్ ఇజ్ బ్యాక్ అంటూ దొరికిపోయిన మహేష్ బాబు….!!

0

Mahesh Babu, Netizens, Twitter

మహేష్…మహేష్…మహేష్ ..ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు మారుమ్రోగిపోతుంది ఈ వయసులో కూడా మహేష్ ఇంత హ్యాండ్సామ్ గా ఉన్నాడు ఏంట్రా బాబు అని ప్రతి ఒక్కరు కూడా కుల్లుకుంటున్నారు. ఇక ఆతని సినిమాల విషయానికి వెళ్తే ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ ఒక్కో కొత్త కధ మొత్తానికి వహ్వా అనిపిస్తున్నాడు కుర్రాడు. ఒక శ్రిమంతుడిలాగా, ఒక పొలిటికల్ లీడర్ లాగా ఇక ఇప్పుడు వస్తున్నా మహర్షి సినిమాలో ఒక యూత్ కుర్రాడిలా కనిపిస్తున్న మహేష్ ని చూస్తుంటే అమ్మాయిలు అగలేకపోతున్నారు. మహేష్ బాబు ఎప్పటికప్పుడు స్టార్ హీరోస్ సినిమాల గురించి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉంటారు, తాజాగా మురుగుదాస్ దర్శకత్వం లో వచ్చిన విజయ్ సర్కార్ సినిమా పియన్ తన ట్విట్టర్ లో స్పందించారు. ఈ చిత్రంలో మురుగదాస్ మార్క్ కనిపించిందని.. సినిమా చాలా బాగుందని ప్రశంసించాడు. ఐతే తనకు ‘స్పైడర్’ లాంటి డిజాస్టర్ ఇచ్చినా కుడా ..

మహేష్ బాబు అదేమీ మనసులో పెట్టుకోకుండా మురుగదాస్ కొత్త సినిమాను ప్రశంసించడం.. అతడి గురించి సానుకూలంగా మాట్లాడటం మహేష్ గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు అతడిని పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు రూటే వేరబ్బా..ఎప్పుడు కూడా యాక్టివ్ గా అభిమానులను ఆనందంగా ఉంచేలా చేస్తారు. తెలుగు సినిమాలు ఏమో గాని మహేష్ తమిళనాడు సినిమాలపైన బాగా స్పందిస్తారు తాజాగా వచ్చిన విజయ్ సర్కార్ పైన మహేష్ బాబు తన స్టైల్లో స్పందించారు. ఆ మధ్య మణిరత్నం సినిమా ‘చెక్క చివంత వానం’ను కూడా పొగిడాడు మహేష్. నిజానికి మహేష్ చెప్పినంత గొప్ప సినిమా ఏమీ కాదది. తాజాగా ‘సర్కార్’ కూడా డివైడ్ టాక్ తో నడుస్తోంది. దీన్ని మహేష్ పొగిడాడు. అలాగే అక్కడ కాకా రేపుతున్న జల్లికట్టు పైన కూడా మహేష్ స్పందించారు, నాకు అసలు రాజకీయాలు తెలియవు అని వాటి గురించి ఎప్పుడు మాట్లాడను అని చెప్పే మహేష్ బాబు ఇలా జల్లికట్టు పై స్పందించడం ఈ వివాదం విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాడు.

అయితే ఎప్పటినుండో ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ గురించి రచ్చ జరుగుతూనే ఉంది కాని ఎప్పుడు కూడా మహేష్ ఆ విషయంపై స్పందించలేదు కాని తమిళనాడు జల్లికట్టు వివాదం పై స్పందించారు, అలాగే కేరళ వరదలకు విరాళం ప్రకటించారు అంతేకాకుండా ఉత్తరాంధ్రను ముంచెత్తిన తిత్లీ తుపాను సమయంలో మాత్రం సైలెంటుగా ఉండిపోయాడు. ఇలా ఇతర రాష్ట్రాలలో ఏదైనా వస్తే సయం చేసుకుంటూ వారి గురించి స్పందిస్తూ ఉన్న మహేష్ బాబు ఆంధ్ర కోసం కనీసం ఆలోచించడం లేదు అంటూ నెటిజన్లు (Netizens) సటైర్స్ పేలుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు మహేష్ మనసులో ఏముందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

 

Click here : మహేష్ ఇలా అయితే కష్టమయ్య తట్టుకోవడం…?

Read more about : NTR   Vijay Devarakonda    Prabhas    Akkineni akhil

You might also like