Saakshyam
Nothing scared but the truth

మహిళను అడ్డం పెట్టుకొని..రాహుల్ కు మహిళా కమిషన్ నోటీసులు

NCW issues notice to Rahul Gandhi over his remarks on Nirmala Sitharaman | National news | Saakshyam

0

NCW issues notice to Rahul Gandhi over his remarks on Nirmala Sitharaman | Telugu political news | Saakshyam

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రధాని మోడీ, మహిళను అడ్డం పెట్టుకుని రక్షించుకుంటున్నారన్న రాహుల్ (NCW issues notice to Rahul Gandhi over his remarks on Nirmala Sitharaman) వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఈమేరకు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటులో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ మోడీపై సెటైర్లు వేశారు రాహుల్. మోడీ తనను కాపాడుకోవటానికి మహిళను అడ్డం పెట్టుకున్నారని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. ఈమేరకు ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

 

రఫేల్ ఒప్పందంపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొనకుండా మోడీ పారిపోయారని, తనను కాపాడాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అవినీతిని అనుమతించబోనని, చౌకీదార్ లా దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోడీ లోక్ సభలో రాఫెల్ ఒప్పందంపై చర్చ జరిగినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా లేచి నిలబడలేకపోయారన్నారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు 56 అంగుళాల ఛాతీ ఉన్న చౌకీదారు అక్కడినుంచి పారిపోయారు. తనను తాను సమర్థించు కోలేకపోతున్నానని, ఆ పని చేయాలని ఒక మహిళను (రక్షణమంత్రి సీతారామన్ ను) కోరుకున్నారు. 2.30 గంటలు జరిగిన చర్చలో ఆమె మోడీని సమర్థించలేకపోయారు. అవినీతి జరిగిన మాట వాస్తవమా? కాదా? అని అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు అని రాహుల్ అన్నారు.

 

NCW issues notice to Rahul Gandhi over his remarks on Nirmala Sitharaman | Telugu political news | Saakshyam

రాఫేల్ వివాదంపై చర్చలో ప్రధాని మోడీ చర్చ నుంచి పారిపోయి మహిళ వెనుక దాక్కున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై నోటీసులు జారీఅయ్యాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో వచ్చిన వార్తా కథనాలను జాతీయ మహిళ కమిషన్ సుమోటోగా స్వీకరించి రాహుల్ గాంధీకి వివరణ నిమిత్తం నోటీసులు జారీచేసింది.  ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తప్పుపట్టింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదని కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. మహిళ గౌరవ మర్యాదలను అగౌరపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు పేర్కొంది. తన వ్యాఖ్యలపై రాహుల్ వివరణ ఇవ్వడమే గాకుండా సీతారామన్ కు క్షమాపణలు చెప్పాలని కోరారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like