Saakshyam
Nothing scared but the truth
Page Right

వచ్చే ఎన్నికల్లో జగన్ తప్ప సీఏం మరెవ్వరు కాలేరు : టీఎస్ మంత్రి

0

Nayini narasimha reddy, Chandrababu, Revanth reddy

ఏపీ లో ఎన్నికల జోరు రోజురోజుకి ఎక్కువైపోతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఒకరికిమించి ఒకరు తమ పార్టీని ప్రచారం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు జగన్ కి వస్తున్నా ఆదరణ చూసి గుండె పగిలి చస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎలాగైనా సరే జగన్ పైన పై చెయ్యిగా నిలవాలని కలలు కంటున్నారు కాని అవి జరగవు రానున్న ఎన్నికల్లో సీఏం సీట్ జగన్ కే దక్కుతుందని తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన ఎన్ని జిత్తులు మరి పనులు చేసిన కూడా జగన్ సీఏం కావడం ఎవరు తరం కాదు అని వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణా అసెంబ్లీ లో తన చెంచాలు ఒకరు ఇద్దరు ఉండాలని బాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని అయిన కూడా ఎవరు ఏమి చెయ్యలేరు అంటూ మాట్లాడారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒక బచ్చా అని… నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తిట్టేందుకే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక కుట్ర దారుడని, అతని ఒక భూకబ్జాదారుడు అంటూ ఎద్దేవా చేశారు.

You might also like