Saakshyam
Nothing scared but the truth
Page Right

రేవంత్ రెడ్డి ని ఓడించడానికి 100 కోట్లా దిన్నేమంటారు…నవ్వు రాదు మరి..?

0

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై రోజురోజుకి విమర్శలు ఎక్కువైపోతున్నాయి, రానున్న ఎన్నికల్లో జైల్లో ఉండి అయిన సరే గెలిచి చూపిస్తా అంటూ సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డి పై టీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు. అతను అరాచకాలను కట్టి పెట్టాలి అంటూ తాజాగా మరో టీఆర్ ఎస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాజాగా కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. ఈరోజు విలేకర్లతో మాట్లాడిన అతను రేవంత్ రెడ్డి ని ఓడించడానికి 100 కోట్లు ఖర్చుపెడుతున్నారు అంటూ వస్తున్న వార్తలు నవ్వు వస్తుంది అంటూ ఇది నిజంగానే హాస్యాస్పదమని అన్నారు. దీనికోసం లక్ష రుపయిలి ఖర్చు పెట్టడమే ఎక్కువ అలాంటిది 100 కోట్లు అంటూ వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి పనులు ఇప్పటికే జనాలకు అన్ని తెలిసిపోయయాయి వచ్చే ఎన్నికల్లో జనాలు అతనిని వ్యతిరేకించడం తప్పనిసరి అని, ఇప్పుడు నేట్టింట్లో హల్చల్ చేస్తున్న వార్తలు అన్ని కూడా తప్పుడు వార్తలు అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి కి దమ్ము ధైర్యం ఉంటె కేసీఆర్, కేటీఅర్ కాదు నాపైన గెలిచి చూపించమనండి అంటూ నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు జరిగిందని, ఈ దీపావళి నాటికి మిషన్ భగీరథ నీళ్లు అన్ని గ్రామాలకు అందుతాయని చెప్పారు. అసలు సాగునీరు ఆలస్యం కావడానికి రేవంత్ రెడ్డే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

You might also like