Saakshyam
Nothing scared but the truth

గర్జిస్తున్న కంఠీరవం కంఠాన్ని నొక్కగలమా?

Murali Muchatlu On YS Jagan Padayatra || Saakshyam Political News

0

Murali Muchatlu On YS Jagan Padayatra || Saakshyam Political News

ఆ రోజు ఆ దుర్ఘటన జరగకుండా ఉంటె… ఈపాటికి వైసిపి నాయకులు, కార్యకర్తలు అంబరాలను అంటే సంబరాలలో మునిగితేలేవారు.  తమ అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి ( Murali Muchatlu On YS Jagan Padayatra ) తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర ఏడాది పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించబడేది.  జగన్ ఆత్మస్థైర్యం, ఉక్కుసంకల్పం, చెక్కుచెదరని మనోనిబ్బరం నభూతో నభవిష్యతి అని కీర్తించబడుతుండేవి.

కానీ, దురదృష్టం.   జగన్ కు లభిస్తున్న అంతులేని ఆదరణను చూసి కళ్ళు చెదిరిన దుష్టశక్తులు ఏకంగా జగన్ ను భౌతికంగా నిర్మూలించడానికి తెగించాయి.  ఒక అంతర్జాతీయస్థాయి విమానాశ్రయంలోనే జగన్ ను హత్యచేయడానికి బరితెగించారంటే ఆ కుట్ర సామాన్యమైనది కాదు.  శ్రీమతి  భారతి మంగళసూత్రం గట్టిది కాబట్టి దైవికంగా తప్పించుకున్నాడు.  పదిరోజులు గడిచినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రంగంలోని సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, నిందితుడినుంచి కనీస సమాచారం రాబట్టలేకపోయారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉంటుందా?  అసలు ఆ డీజీపీ పదవిలో క్షణం కూడా ఉండటానికి అర్హుడేనా?  దొరికిన నిందితుడినుంచి నిజాలు రాబట్టలేని ఈ పోలీసులు జగన్ కు న్యాయం చేస్తారని ఎలా ఊహించగలం?

Murali Muchatlu On YS Jagan Padayatra || Political News || రాజకీయ వార్తలు

ఆ విషయాన్ని పక్కన పెడితే…సుమారు పదకొండు నెలలకు పైగా సాగిన పాదయాత్ర ఇప్పటికి మూడువంతులు నియోజకవర్గాలను స్పృశించింది.  పదకొండు జిల్లాల్లో అవిశ్రాంతంగా పర్యటన సాగింది.  ఎక్కడికి వెళ్లినా, జగన్ కు మంగళహారతులు, జన నీరాజనాలు లభించాయి.  ఎక్కడ బహిరంగసభ జరిగినా, లక్షలాదిమంది జనవాహిని హాజరై జగన్ కు జేజేలు కొట్టారు.  విశాఖపట్నం లో జరిగిన బహిరంగసభకు అంతకు ముందెప్పుడూ రానంత సంఖ్యలో జనం హాజరై జగన్ కు హారతులు పట్టారు.  సంఘీభావం ప్రకటించారు.

ఇక జగన్ తన పాదయాత్రలో సాధించిన ఘనవిజయాలు తక్కువేమీ కావు.  బీజేపీతో అంటకాగుతూ రాష్ట్రప్రయోజనాలను పణంగా పెట్టి, ఓటుకు నోటు కేసులోనుంచి గట్టెక్కడానికి మోడీకి దాసానుదాసుడై, ప్యాకేజీకి అంగీకరించి, ప్రత్యేకహోదా అంటే జైల్లో పడేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అహంకారాన్ని తుత్తునియలు గావించాడు జగన్.  హోదాకావాలి అని కేకలుపెట్టే స్థితికి చంద్రబాబు ను తెచ్చి,  కేంద్రంతో సంబంధాలు తెంచుకుని, రాష్ట్రంలో బీజేపీ మంత్రులను తొలగించి, జగన్ గొంతుతో గొంతు కలపాల్సిన అగత్యాన్ని కల్పించడం జగన్ సాధించిన ఘనవిజయం.  జగన్ పాదయాత్ర చెయ్యకుండా ఉన్నట్లయితే చంద్రబాబు బీజేపీతో ఇంకా సంబంధాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని సర్వం దోచుకునేవాడే.  జగన్ సింహనాదంతో రాజకీయపరిస్థితి మొత్తం మారిపోయింది.

ఇక జగన్ పాదయాత్ర మొదలుపెట్టాక అనేక సంస్థలు రాజకీయ పరిస్థితి మీద జరిపిన సర్వేలలో రాబోయే ఎన్నికల్లో వైసిపి ఘనవిజయాన్ని సాధిస్తుందని తేల్చాయి.  తాజాగా రిపబ్లిక్ టీవీ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ఇరవై లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని నిర్ధారించి తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.  వైసిపికి 120  అసెంబ్లీ స్థానాలు దక్కడం ఖాయమని సర్వేలన్నీ కుండబద్దలు కొడుతున్నాయి.  ఇంతకంటే జగన్ కు మరేమి కావాలి?

అరచేతిని అడుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో, హత్యాయత్నాలు చేసి జగన్ పర్యటనను అడ్డుకుంటామని భ్రమించడం వెర్రితనం.  ఉప్పొంగే కెరటాన్ని, ఉరికివచ్చే జవనాశ్వాన్ని, అగ్నిపర్వతం వెదజల్లుతున్న జ్వాలాముఖిని, భూమిని ఢీకొనే నక్షత్రాన్ని ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో ఆపడం సాధ్యమయ్యే పనికాదని జగన్ మీద కుట్రలు చేసిన మూర్ఖులు తెలుసుకుంటే మంచిది.  లేకపోతె రేపటి ఎన్నికల్లో వారికి ధరావతులు కూడా దక్కవు.

కథనం మరియు విశ్లేషకులు:
ఇలపావులూరి మురళీ మోహన రావు గారు

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : దుష్ట శక్తుల మీద సాధించిన విజయం ఇది – జగన్

You might also like